Advertisement
Varasudu Movie Review in Telugu: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన వారిసు చిత్రం సంక్రాంతి కానుకగా నేడు విడుదలైంది. తెలుగులో వారసుడు పేరుతో రాబోతున్న ఈ సినిమాని ముందుగా తమిళంలో విడుదల చేశారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ భారీ చిత్రానికి టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. జయసుధ, శ్రీకాంత్, సంగీత, శ్యామ్, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్ తో పాటు పలువురు టాలీవుడ్ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.
Advertisement
Read also: TOP 5 RICHEST TOLLYWOOD HEROINES LIST: ఇండస్ట్రీలో అత్యంత సంపన్నులుగా ఉన్న 6 హీరోయిన్స్ వీరే..!!
Varasudu Movie Story in Telugu: సినిమా కథ:
వారసుడు కథ విషయానికి వస్తే.. తండ్రి కొడుకుల మధ్య ఉన్న ఈగోతో ఫ్యామిలీ రిలేషన్స్ ఎంత ముఖ్యమో ఈ సినిమాలో చెప్పే ప్రయత్నం చేశారు. భారతదేశంలోని అతిపెద్ద వ్యాపారవేత్త రాజేంద్రన్( శరత్ కుమార్). ఇతనికి ముగ్గురు కొడుకులు. జై ( శ్రీకాంత్), అజయ్( శ్యామ్ ), విజయ్ ( విజయ్). తన వ్యాపార సామ్రాజ్యాన్ని ముగ్గురు కొడుకులలో ఎవరికి అప్పజెప్పాలనే ఆలోచనలో ఉంటాడు రాజేంద్రన్. ముగ్గురు కొడుకులలో చిన్న కుమారుడు విజయ్ మాత్రం తండ్రికి విరుద్ధంగా ప్రవర్తిస్తాడు. విజయ్ కి తన తండ్రి విధానాలు నచ్చక అభిప్రాయ బేధాలు వచ్చి ఇంటి నుండి బయటకు వెళ్లిపోతాడు. ఇక జై, అజయ్ ల కన్ను మాత్రం చైర్మన్ కుర్చీ పైనే ఉంటుంది. ఎలాగో వ్యాపార ప్రత్యర్ధులు జై ప్రకాష్( ప్రకాష్ రాజ్) ఉండనే ఉన్నాడు. ఈ క్రమంలో రాజేంద్రన్ తన టైం అయిపోయిందని గ్రహిస్తాడు. తన సామ్రాజ్యానికి అసలైన వారసుడు ఎవరో తెలుసుకోవాలనుకుంటాడు. ఆ సమయంలో ఇంట్లో నుండి వెళ్లిపోయిన విజయ్ తిరిగి ఇంటికి వస్తాడు. ఆ సమయంలో ఇంట్లో కుటుంబంతో పాటు అటు వ్యాపారంలో కూడా సమస్యల గురించి తెలిసి వాటిని ఎలా ఎదుర్కొంటాడు? తన కుటుంబాన్ని కాపాడాడా? తండ్రితో ఎలా కనెక్ట్ అవుతాడు? రష్మిక తో తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అనేవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Advertisement
మూవీలో తన కెరీర్ ప్రారంభంలో విజయ్ చేసిన సినిమాలలో హైలెట్స్ ఇక్కడ ప్లే అవుతుంటాయి. అవి కచ్చితంగా విజయ్ ఫ్యాన్స్ కు పండగ చేసేవే. విజయ్ ఎంట్రీ సీన్ ప్రేక్షకులతో చప్పట్లు కొట్టిస్తుంది. మాస్ ఆడియన్స్, కుటుంబ ప్రేక్షకులు కచ్చితంగా ఈ సినిమాని ఇష్టపడతారు. అయితే విజయ్ సినిమాలు ఫాలో కాని వారు మాత్రం ఆ స్థాయిలో ఎంజాయ్ చేయలేరు. సెకండ్ హాఫ్ లో కామెడీ, హీరోయిజం ను మీటర్ ప్రకారం మేటర్ లో కలిపి అందించిన కాక్ టెయిల్, మధ్య మధ్యలో సెంటిమెంట్ సీన్స్ ని పేర్చారు. అదృష్టం ఏంటంటే మరీ మెలోడీ డ్రామా వైపుకు తను చేయకపోవడం.
Varasudu Movie Review in Telugu ప్లస్ పాయింట్స్:
విజయ్ యాక్టింగ్
కామెడీ వన్ లైనర్స్
యోగి బాబుతో వచ్చే సీన్స్
మైనస్ పాయింట్స్:
రొటీన్ కథ
ప్రేడిక్టబుల్ స్క్రీన్ ప్లే
ఫ్యాన్స్ కు నచ్చే సీన్స్ కు ప్రయారిటీ ఇవ్వటం
రేటింగ్ : 2/5