Advertisement
టాలీవుడ్ ఇండస్ట్రీలోని లేడీ సూపర్ స్టార్ గా ఎనలేని ఆదరాభిమానాలు సంపాదించుకున్న హీరోయిన్ విజయశాంతి. అప్పట్లో ఆమె సినిమాలు అంటే హీరోలతో సమానంగా పోటీ పడి మరీ వచ్చేవి అంటే అతిశయోక్తి కాదు. ఈ విధంగా విజయశాంతి తెలుగు ఇండస్ట్రీలోని అభిమానులను సంపాదించుకుంది. ఇదంతా పక్కన పెడితే విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ కు మరియు నందమూరి కుటుంబానికి చాలా దగ్గరి సంబంధం ఉందట..
Advertisement
ALSO READ; వేణుమాధవ్ 10 ఎకరాల భూమికి..పవన్ కళ్యాణ్ కు ఉన్న సంబంధంఏంటంటే ?
Advertisement
దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఆ వివరాలు ఏంటో పూర్తిగా చూద్దాం.. శ్రీనివాస్ ప్రసాద్,ఎన్టీఆర్ పెద్దల్లుడు గణేష్ రావు కు స్వయాన మేనల్లుడు కావడం విశేషం.. ఈ విధంగా నందమూరి కుటుంబానికి బంధువైన శ్రీనివాస్ ప్రసాద్ నిర్మాతగా బాలయ్యతో కలిసి యువరత్న ఆర్ట్స్ స్థాపించారు. వీరి నిర్మాణ సారథ్యంలో బాలయ్య హీరోగా నిప్పురవ్వ అనే సినిమాను కూడా చేశారు. ఇందులో హీరోయిన్ విజయశాంతి..
ఈ సమయంలోనే శ్రీనివాస్ ప్రసాద్ తో పరిచయం ఏర్పడింది. ఇలా వీరి పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి వరకు దారి తీసింది. అలాగే వీరి సారధ్యంలో వచ్చిన నిప్పురవ్వ మూవీ మాత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. కానీ నిప్పురవ్వ సినిమా మాత్రం విజయశాంతిని, శ్రీనివాస్ ప్రసాద్ లను ఒక్కటి చేసిందని చెప్పవచ్చు.
ALSO READ;అమ్మ చివరి కోరికను తీర్చలేని మహేష్ బాబు కుమిలిపోతున్నారా?