Advertisement
కాశ్మీర్ లో పండిట్స్ మరణ హోమం, గోరక్షణ పేరుతో చేస్తున్న హింస ఒకటేనని ఇటీవల సాయి పల్లవి చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ఈ విషయంలో చాలామంది సాయిపల్లవి పై మండి పడుతున్నారు. రీసెంట్ గా సీనియర్ నటి, బిజెపి నేత విజయశాంతి కూడా ఈ విషయంపై మాట్లాడారు. ట్విట్టర్ వేదికగా ఆమె కొన్ని ట్వీట్స్ పెట్టారు.
Advertisement
ఆమె ఏమన్నారంటే… ” కాశ్మీర్ పండిట్ల పై దారుణ ఆకృత్యాలకు పాల్పడిన వారిని… గోవధ కోసం ఆవుల అక్రమ రవాణాకు పాల్పడే వారిని అడ్డుకున్న గోసంరక్షకులను ఒకే గాటన కడుతూ హీరోయిన్ సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర వివాదానికి దారితీశాయి. మతోన్మాదంతో తో పండిట్ లపై మరణకాండ సృష్టించడం… ధర్మం కోసం దైవ సమానమైన గోవులను కాపాడుకునేందుకు గో రక్షకులు చేసే పోరాటం ఒకటే ఎలా అవుతాయో కాస్త ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. డబ్బు కోసం దోపిడీ దొంగ ఎవరినైనా కొట్టడం… తప్పు చిన్న పిల్లవాడిని తల్లి దండించడం ఏవిధంగా ఒకటి అవుతాయి? ఆ దోపిడి దొంగను, తల్లిని ఒకేలా చూస్తారా? ఎవరైనప్పటికీ తమకు అవగాహన లేని విషయాల ప్రస్తావన వచ్చినప్పుడు సున్నితంగా ఆ అంశాన్ని పక్కన పెట్టడం మంచిది.
Advertisement
నేడు మనం మాట్లాడే ప్రతి మాట క్షణాల్లో కోట్లాది మందికి చేరిపోతూ… ఆ మాటల్లో ఏ మాత్రం తేడా ఉన్నా పట్టుకొని ప్రశ్నించే సమాజంలో ఉన్నాం. అందువల్ల మాట్లాడే అంశాలపై సమగ్ర అవగాహనతో… సామాజిక స్పృహతో స్పందించడం చాలా అవసరమని గ్రహించాలి.ఏది ఏమైనా ఆ సినిమా ఆర్థిక లాభాలతో ఆసక్తి ఉన్న నిర్మాణ సంబంధిత తులు, కాశ్మీర్ ఫైల్స్ పోలిక తెచ్చి, ప్రజల దృష్టిని ఆకట్టుకోవడానికి చేసిన ఫ్రీ రిలీజ్ కార్యక్రమంలో ఆ కథానాయికను సమస్యల్లోకి లాగినట్టు ఉందేమో అని కొందరు అభిప్రాయ పడుతున్నట్లు సమాచారం కూడా అందుతోంది” అంటూ విజయశాంతి తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.