Ads
పవన్ కళ్యాణ్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. పవన్ కళ్యాణ్ పేరు వినపడినా పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినా ఇక ఫ్యాన్స్ కి పూనకాలు అంతే. అందులో డౌటే లేదు. పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా గత శుక్రవారం రిలీజ్ అయింది.
ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది కానీ సాధారణంగా ఏ సినిమాకైనా ఇలాంటి టాక్ వచ్చిందంటే కోలుకోవడం కష్టమే పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి ఊహించని వసూళ్లు ని సొంతం చేసుకుంది. కేవలం రెండు రోజుల్లోనే దాదాపు 75 కోట్లు సాధించిన ఈ మూవీ ఈజీగా 150 కోట్ల రేంజ్ కి వెళ్ళిపోవచ్చు అని టాక్ వినబడుతోంది.
Advertisement
దీంతో ఇది వరకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్లు నిజమే అన్నట్లుగా తెలుస్తోంది. అలీ హోస్టుగా వ్యవహరించినప్పుడు విజయేంద్ర ప్రసాద్ గెస్ట్ గా వచ్చారు. పవన్ కళ్యాణ్ కోసం ఎలా స్టోరీ రాస్తారు అని అడిగితే.. పవన్ కళ్యాణ్ నటించిన పాత సినిమాలో కొన్ని సన్నివేశాలను తీసుకుని కథ రాసేయచ్చు. పెద్దగా స్టోరీ కోసం కష్టపడక్కర్లేదు ఎందుకంటే ఆయనను చూడడానికి జనాలు వస్తారు.
డైనమిక్ ని పేల్చడానికి చిన్న అగ్గిపుల్ల చాలంటూ విజయేంద్ర ప్రసాద్ అన్న మాటలు బ్రో సినిమాకి సరిగ్గా సరిపోయాయి. నిజానికి ఇందులో పెద్ద స్టోరీ లేదు. కానీ ఈ సినిమాకి మాత్రం మంచి రెస్పాన్స్ వస్తోంది.
Also read:
- హీరోయిన్లు లేకపోయినా సినిమాలు చేసిన స్టార్ హీరోలు వీళ్ళే..!
- శ్రీలీల లాగే ఫస్ట్ మూవీ తోనే.. స్టార్ స్టేటస్ అందుకున్న హీరోయిన్స్ వీళ్ళే..!
- అలా పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తున్నందుకు.. సాయి ధరమ్ తేజ్ కౌంటర్..!