Advertisement
నేటి రోజులలో ప్రతి ఒక్కరి జీవితంలో సోషల్ మీడియా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సామాన్య ప్రజల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు వారికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా గుర్తింపు సంపాదించుకుంటున్నారు. క్రేజ్ అనేది కేవలం సెలబ్రిటీలకు మాత్రమే పరిమితం కాదు. సామాన్య ప్రజలు కూడా వారికి నచ్చిన విధంగా సింగింగ్, డాన్సింగ్, యాక్టింగ్, వంటలు, రకరకాల విన్యాసాలకు సంబంధించిన వీడియోలను క్రియేట్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీ స్టేటస్ ని సంపాదించిన వారు చాలామంది ఉన్నారు.
Advertisement
ప్రస్తుతం ఓ కుర్రవాడు బైక్ తో చేసిన విన్యాసం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను ముస్తు రైడర్ తమ ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. పబ్లిక్ రోడ్లకు దూరంగా, అనేక ఇసుక దిబ్బలు ఉన్న ప్రదేశంలో వీడియో రికార్డ్ చేయబడింది. ఈ దిబ్బలలో ఒకదాని ప్రక్కన ఐదు మోటార్ సైకిళ్లు ఉంచబడ్డాయి.
స్ప్లెండర్‌లో ఉన్న బైకర్ అధిక వేగంతో వాలుకు చేరుకొని స్ప్లెండర్ బైక్ ను లిఫ్ట్ చేసి ఆ ఐదు బైక్ పైనుంచి ఎంతో తేలికగా బైక్ తో పాటు జంప్ చేశాడు. ఐదు బైక్స్ పైనుంచి జంప్ చేసిన తర్వాత వేగంగా వచ్చి నేలకు కొట్టుకోవడం ఈ వీడియోలో కనిపిస్తుంది. కానీ అతను నైపుణ్యం కలవాడిగా ఎటువంటి పొరపాటు లేకుండా బైక్ తో ముందుకు సాగిపోయాడు.
ఇప్పటివరకు ఈ వీడియోకి దాదాపు 3.2 మిలియన్ల వీక్షణలు, 257K లైక్‌లు, 1310 కామెంట్స్ మరియు 158K షేర్లను పొందింది. ముస్తు రైడర్ ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ లో షేర్ చేయబడిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారడంతో నెటిజన్లు బాగా ఆకట్టుకుంటుంది. ఇక నెటిజన్లు సైతం తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. రైడర్ ధరించే సేఫ్టీ గేర్ లేదని వీడియో స్పష్టంగా చూపిస్తుంది. అలాగే, ఈ సాహసోపేతమైన ఫీట్ కోసం హీరో స్ప్లెండర్‌ను ఎంచుకోవడం ఆందోళన కలిగిస్తుంది. అటువంటి విపరీతమైన విన్యాసాల కోసం స్ప్లెండర్‌ను ఉపయోగించడం మోటార్ సైకిల్‌పై ఒత్తిడిని కలిగిస్తుంది. నీ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేయగా, మరొక వ్యక్తి హాస్యాస్పదంగా నీ వెన్నుపూసకు rip అంటూ కామెంట్ చేశాడు.
Also read :
2029 దాకా జగన్ ఏ సీఎం.. వేణుస్వామి షాకింగ్ కామెంట్స్..!
“బాహుబలి” విజయ్ చేస్తే ఎలా ఉండేది? అనే ప్రశ్నకి నెటిజెన్ ఇచ్చిన సమాధానం చూస్తే నవ్వు ఆపుకోలేరు !