Advertisement
టీ-20 వరల్డ్ కప్ లో టీమిండియాకు మరో విజయం దక్కింది. బంగ్లాదేశ్ తో జరిగిన కీలక మ్యాచ్ లో రోహిత్ సేన గెలుపొందింది. వర్షం వల్ల కాసేపు ఆగిపోయినా తిరిగి ప్రారంభమవడంతో భారత్ 5 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో సెమీస్ ఆశలు సజీవం అయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ చేసింది. విరాట్ కోహ్లి(64) మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
Advertisement
కోహ్లికి తోడుగా కేఎల్ రాహుల్(50) నిలబడ్డాడు. సూర్య కుమార్(30) ఫర్వాలేదనిపించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది టీమిండియా. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగారు బంగ్లా ఆటగాళ్లు. అయితే.. మ్యాచ్ మధ్యలో వర్షం పడింది. దీంతో కాసేపు నిలిపివేశారు అంపైర్స్. వర్షం తగ్గాక భారత జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని 151 రన్స్ కు కుదించారు. 16 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది బంగ్లా టీమ్. దీంతో భారత్ గెలుపు ఖాయమైంది.
Advertisement
ఇక ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు. టీ-20 వరల్డ్ కప్ మ్యాచుల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ గా నిలిచాడు. ఇప్పటిదాకా శ్రీలంక ఆటగాడు జయవర్ధణే పేరిట ఉన్న ఈ రికార్డును బ్రేక్ చేశాడు. జయవర్ధణే 31 ఇన్నింగ్స్ లో 1016 రన్స్ చేయగా.. కోహ్లి ఆ రికార్డును కేవలం 25వ ఇన్నింగ్స్ లోనే దాటేశాడు. ఈ మ్యాచ్ లో 16 రన్స్ చేయగానే ఈ మైలురాయిని అందుకున్నాడు.
2014, 2016 వరల్డ్ కప్ మ్యాచ్ లలో విరాట్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 2014లో లీడింగ్ రన్ స్కోరర్ గా నిలిచాడు. ఆ టోర్నీలో కోహ్లి అత్యధికంగా 319 రన్స్ చేశాడు. అయితే.. ఫైనల్లో శ్రీలంక చేతిలో ఇండియా ఓడిపోయింది. తాజా రికార్డ్ తో కోహ్లికి అందరూ కంగ్రాట్స్ చెబుతున్నారు.