Advertisement
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో క్రేజ్ మామూలుగా ఉండదు. అతను ఏ చిన్న విషయాన్ని అయినా సరే పోస్ట్ చేయగానే అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తుంటారు. ఐపీఎల్ కు వరుసగా రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు తరపున 16 సీజన్ లో ఆడెందుకు కోహ్లీ సిద్ధమవుతున్నాడు. 19 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే 2008లో ఆర్సిబి జట్టులో చేరి కెప్టెన్ గా చేశాడు విరాట్ కోహ్లీ.
Advertisement
READ ALSO : ఎన్టీఆర్, చిరంజీవి లాగే త్రిపాత్రాభినయం చేసిన 9 మంది తెలుగు హీరోలు !
ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ కప్పును మాత్రం సాధించలేకపోయాడు. ఐపీఎల్ వచ్చిన ప్రతిసారి విరాట్ సారథ్యంలో ఆర్సిబి జట్టు కప్పు గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ విరాట్ కోహ్లీ చెప్పే ఈసాల కప్ నమ్ దే అనే స్లోగన్ కూడా ఫేమస్ అయింది. తాజాగా విరాట్ అభిమానులను ఆశ్చర్యపరిచే విధంగా తన పదవ తరగతికి సంబంధించిన మార్కుల జాబితాను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ మార్కుల షీట్ పైన స్పోర్ట్స్ అంటూ ఆదనపు సబ్జెక్టుగా పెట్టాడు. 2004లో విరాట్ కోహ్లీ 10వ తరగతి పాస్ అయినట్టు మెమోలో కనిపిస్తోంది.
Advertisement
READ ALSO : కేవలం నందమూరి కుటంబంలోనే ఎందుకు ఇలా ? వరుస పెట్టి ప్రమాదల వెనక ఇంత కథ ఉందా ?
ఇంగ్లీష్ లో 83, హిందీలో 75, మ్యాథ్స్ లో 51, సైన్స్ అండ్ టెక్నాలజీలో 55, సోషల్ లో 81 మార్కులు సాధించాడు. క్రీడల సంగతి ఏంటి అన్నట్టు వదిలేసి తన స్టైల్ లో విరాట్ క్యాప్షన్ ఇచ్చాడు. ‘మార్కుల జాబితాలో కనీసం చోటు లేని సబ్జెక్టు ఇప్పుడు ఎక్కువ భాగం కావడం విశేషం ఉంది అనే కోణంలో రాసుకొచ్చాడు. మార్కుల షీట్ మీద స్పోర్ట్స్ అనే పదం ఉన్న పోస్టును డిలీట్ చేసిన కోహ్లీ మళ్లీ మెమో షేర్ చేయడం గమనార్హం. ప్రస్తుతం సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీకి సంబంధించిన పదవ తరగతి మార్కుల మెమో తెగ వైరల్ అవుతుంది.