Advertisement
Actress Sonia Singh Best Youtube Short Films: సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన చిత్రం “విరూపాక్ష”. ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లు కాకుండా ఓ అమ్మాయి మిమ్మల్ని చాలా ఎట్రాక్ట్ చేసి ఉంటుంది. ఈ మూవీలో ఆమె చేసింది చిన్న పాత్రే అయినా చాలా కీలకమైన పాత్రలో నటించింది. ఆ అమ్మాయి ఎవరో కాదు సోనియా సింగ్. ఈ ముద్దుగుమ్మ యూట్యూబ్ నుంచి సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటుతూ అందరి ప్రశంసలు అందుకుంటుంది.
Advertisement
Read also: వంటింట్లో పాత్రలు కడిగే స్పాంజ్ తో కడుగుతున్నారా ?అయితే ఇది ఎంత ప్రమాదమో తెలుసుకోండి !
Actress Sonia Singh Best Youtube Short Films
ఇప్పుడు ఎక్కడ చూసినా ఈమె పేరే వినిపిస్తోంది. 1998 మార్చి 31న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించిన సోనియా సింగ్.. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటుంది. బాంబే నుంచి వచ్చిన సోనియా మొదట “హే పిల్ల” అనే ఛానల్ లో నటించింది. ఈమెకి వచ్చి రాని తెలుగు ఒక ఎత్తు అయితే.. డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో ఇంకా పాపులర్. దాదాపు నాలుగేళ్ల క్రితమే యూట్యూబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సోనియా సింగ్.. ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈమె యాక్ట్ చేసిన 10 బెస్ట్ షార్ట్ ఫిలిమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
సాఫ్ట్వేర్ సావిత్రి, ఓయ్ పద్మావతి, షి అండ్ పీరియడ్స్, నాన్ తెలుగు గర్ల్ ఫ్రెండ్, పెళ్లయిన కొత్తలో, అనసూయ రామలింగం, సుజాత సుబ్రహ్మణ్యం, ప్రేమలేఖ, పాతకాలపు స్నేహితురాలు, రౌడీ బేబీ వంటి షార్ట్ ఫిలిమ్స్ నెటిజన్స్ ని బాగా ఎంటర్టైన్ చేశాయి. ఒక విధంగా చెప్పాలంటే సోనియా సింగ్ క్రేజ్ పెరగడానికి ఇవి చాలా సహాయపడ్డాయి. ఇక ఇటీవల ఆమె ఇచ్చిన స్పీచ్ లు కూడా బాగా వైరల్ అయ్యాయి. విరూపాక్ష ప్రమోషన్స్ సమయంలో ఈమె మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి పాతికేళ్లకే ఇంత క్రేజ్ దక్కించుకున్న సోనియా సింగ్ కెరీర్ లో హీరోయిన్ అవుతుందో లేదో చూద్దాం.
Mr & Mrs Alivelu Srinivasulu
NON TELUGU GIRL FRIEND
Read also: స్టార్ హీరో సినిమాల కైతే అలా నాని సినిమాకి ఇలా…? “దసరా” సినిమాని అణిచి వేస్తున్నారా?