Advertisement
Weekly Horoscope in Telugu 2022 : వృత్తి వ్యాపారాలు చేసే వృషభ రాశి వారికి ఆర్థికంగా ఇది ఎంతో అనుకూల సమయం. మీన రాశి వారు ఉద్యోగం మారే విషయంలో మోసపోయే అవకాశం ఉంది. వీటి వివరాలతో పాటు అన్ని రాశుల వారిగా వార ఫలాలు ఎలా ఉన్నాయంటే!
Advertisement
Weekly Horoscope in Telugu 2022: ఈ వారం మీ రాశి ఫలాలు
మేషం
భూ లావాదేవీలలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులకు పదోన్నతి అలాగే స్థానచలనం కూడా ఉంటుంది. కావలసిన డబ్బు చేతికి అందుతుంది. పలుకుబడి పెరుగుతుంది. నైపుణ్యంతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణకు మంచి సమయం. రాజకీయాల్లో ఉన్నవారికి అనుకూల సమయం.
Today Horoscope in Telugu 2022
వృషభం
ఇంట్లో సంతోషకరమైన వాతావరణము ఉంటుంది. అన్నదమ్ములతో అనుబంధం పెరుగుతుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యాపారం లాభసాటీ గా సాగుతుంది. పనులు జోరు అందుకుంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరిగినప్పటికీ అందుకు తగ్గ గుర్తింపు కూడా ఉంటుంది. నలుగురికి సహాయపడతారు. కొత్త వస్తువులు అలాగే ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు.
మిథునం
కోర్టు వ్యవహారాలలో జాప్యం జరుగుతుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. తీర్థయాత్రలు అలాగే విహారయాత్రలు చేపడతారు. పట్టుదలతో పనులు పూర్తి చేయడం చాలా అవసరం అలాగే ఆరోగ్యంగా ఉంటారు.
కర్కాటకం
ఈ రాశి వారు కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంటుంది. అధికారులతో స్నేహంగా ఉంటూ పనులు పూర్తి చేసుకుంటారు. వ్యాపార భాగస్వామ్య మధ్య అవగాహన పెరుగుతుంది. నలుగురికి ఉపయోగపడేలా పనులు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది.
సింహరాశి
పాత బాకీలు వసూలు అవుతాయి. శ్రమకు తగ్గిన ప్రతిఫలం పొందుతారు. తీర్థయాత్రలకు వెళ్తారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పిల్లల విషయంలో అనుకూల నిర్ణయాలు తీసుకుంటారు.
కన్య రాశి
Advertisement
బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా ఉంటారు. స్థిరాస్తి ద్వారా రాబడి వస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వాహన సౌఖ్యం ఉంటుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంగా జీవిస్తారు. కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి.
తుల రాశి
శుభకార్యా ప్రయత్నాలలో నలుగురికి సహాయం చేస్తారు. మీకు కూడా సహకారం లభిస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. శ్రమ అధికమైనప్పటికీ అనుకున్నది సాధిస్తారు. నూతన ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
వృశ్చికం
ఆదాయం స్థిరంగా ఉంటూ క్రమేపి పెరుగుతుంది. స్నేహితులు మరియు బంధువులతో పనులు పూర్తి చేసుకుంటారు. అన్నదమ్ములతో సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరవచ్చు. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. ప్రయాణాలు కలిగి వస్తాయి.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండవు కానీ, వాహన ప్రమాద సూచన ఉంది.
మకరం రాశి
వృత్తి మరియు వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాలు లాభసాడిగా కొనసాగుతాయి. కోర్టు కేసులలో విజయం సార్ లభిస్తుంది. ఆదాయం భారీగా పెరుగుతుంది. ఉద్యోగులకు అధికారులతో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చును. వివాదాలకు దూరంగా ఉంటారు. పనులపై మనసు నిలుపుతారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి.
కుంభరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. కోర్టు కేసులు ముందంజలో ఉంటాయి. ఖర్చులు ఎక్కువగా ఉన్న ఉపకరిస్తాయి. ఆపరేషన్ వంటి విషయాల్లో ముందుకు వెళ్లడం మంచిది.
మీనరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం రిస్క్ తో కూడిన కార్యక్రమాలు చేయకపోవడం మంచిది. ఆర్థిక విషయాలు మెరుగ్గా ఉంటాయి. రావాల్సిన ధనం సకాలంలో అందదు. ఉద్యోగ మార్పులు మంచిది కాదు.
Also Read: MS ధోనినా మజకా..మిస్టర్ కూల్ చాణక్యంతో వరల్డ్ కప్ హీరో అయ్యాడు!