Advertisement
Weekly Horoscope in Telugu 2023: ఈ కాలంలో ప్రతి ఒక్కరూ ఈ వారం రాశి ఫలాలు చూసుకుంటున్నారు. అయితే, ఈ జ్యోతిష్యం ప్రకారం వ్యక్తులకు ప్రతి రోజూ ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేయవచ్చు. గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు భవిష్యత్తును అంచనా వేయగలరు. ఇలా మేషం నుంచి మీనం వరకు.. 12-03-2023 నుంచి 18-03-2023 ఎవరెవరికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఇప్పుడు చూద్దాం.
Advertisement
ఈ వారం రాశి ఫలాలు 2023
మేషం
అనుకూల సమయం మొదలవుతున్నది. ఒత్తిడిని అధిగమిస్తారు. పట్టుదలతో పనులు చేస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ప్రణాళిక బద్ధంగా వ్యవహరిస్తారు. వ్యాపారులకు అదృష్టం కలిసి వస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. అధికారుల ఆదరణ పొందుతారు.
READ ALSO : మన స్టార్ హీరోయిన్స్ పెళ్లి చేసుకునే సమయానికి వీరి ఏజ్ ఎంతంటే ?
weekly horoscope in Telugu 2023
వృషభం
పనులు ముందుకు సాగుతాయి. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. బంధువర్గంతో ప్రతికూల పరిస్థితులు ఏర్పడవచ్చు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. రాబడి మార్గాలపై దృష్టిసారిస్తారు.
మిథునం
తాత్కాలిక ప్రయోజనాలు పొందుతారు. పలుకుబడి పెరుగుతుంది. రోజు వారి వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్తువులు, దుస్తులు కొనుగోలు చేస్తారు. విహారయాత్రలు చేపడతారు.
కర్కాటకం
వారం ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఉన్న క్రమంగా అనుకూల వాతావరణ ఏర్పడుతుంది. నూతన ఉద్యోగ అవకాశం ఉంది. పదోన్నతికి అవకాశం. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. రాబడి ఖర్చులకు బేరీజు వేసుకోవడం మంచిది.
సింహం
కొన్ని ముఖ్యమైన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. స్నేహితుల సహకారం లభిస్తుంది. రాజకీయ, కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నిర్మాణరంగంలో ఉన్న వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. ప్రణాళిక బద్ధంగా పనులు చేపడుతారు.
Advertisement
కన్య
స్నేహితులు, బంధువులతో సఖ్యత పెరుగుతుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. భూ లావాదేవీలు కలిసి వస్తాయి. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. నిర్మాణ రంగంలో రాబడి పెరుగుతుంది. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి.
తుల
వారం మొదట్లో కొన్ని చికాకులు తలెత్తుతాయి. వారాంతానికి సమసి పోతాయి. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి.
వృశ్చికం
సహనం అవసరం. మాట జారకుండా జాగ్రత్తగా వహించండి. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కళాకారులకు మంచి సమయం. అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగుల కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందుతారు.
ధనుస్సు
కుటుంబ సభ్యులతో అభిప్రాయ బేధాలు తలెత్తవచ్చు. ఉద్యోగులకు మంచి సమయం. రాజకీయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. భూ లావాదేవీలు అప్రమత్తత అవసరం. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు.
మకరం
శుభకార్యాలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు పలిస్తాయి. ఖర్చులు పెరగవచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తలపెట్టిన పనులు పూర్తవుతాయి. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు.
కుంభం
ఆరోగ్యంగా ఉంటారు. ఉల్లాసంతో పనులు చేస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. ఉద్యోగులకు సాటివారి సహకారం లభిస్తుంది. అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. వ్యాపారులకు అనుకూలం సమయం.
మీనం
రోజువారి వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. శుభాకార్య ప్రయత్నాలలో పెద్దల సహకారం లభిస్తుంది.
READ ALSO : ఇంటిముందు కాకి అరిస్తే అది మరణ సూచకమా?