Advertisement
Weekly Horoscope in Telugu 2023: ఈ కాలంలో ప్రతి ఒక్కరూ ఈ వారం రాశి ఫలాలు చూసుకుంటున్నారు. అయితే, ఈ జ్యోతిష్యం ప్రకారం వ్యక్తులకు ప్రతి రోజూ ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేయవచ్చు. గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు భవిష్యత్తును అంచనా వేయగలరు. ఇలా మేషం నుంచి మీనం వరకు.. 23.04.2023 నుంచి 29.04.2023 ఎవరెవరికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఇప్పుడు చూద్దాం.
Advertisement
మేషం
తలపెట్టిన పనులు లాభదాయకంగా పూర్తవుతాయి. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
Read also: వివాహం జరిగే సమయంలో వధువరులు తెల్లటి వస్త్రాలు ఎందుకు ధరిస్తారు?
వృషభం
వృత్తిలో రాణిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. కొత్త పనులు ప్రారంభించకుండా చేతిలో ఉన్న పనులు పూర్తి చేయడంపై దృష్టి సారించండి. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి.
మిథునం
తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వ్యాపార ఒప్పందాలు అనుకూలిస్తాయి. ఆత్మీయులు, స్నేహితుల సహకారంతో పనులు పూర్తవుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి.
కర్కాటకం
ప్రయాణాల వల్ల లబ్ధి చేకూరుతుంది. ఉద్యోగుల తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారు. కొన్ని పనులు అతి కష్టం మీద పోతాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. రావలసిన సొమ్ము ఆలస్యంగా చేతికి అందుతుంది. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి.
సింహం
తలపెట్టిన పనులు సకాలంలో అవుతాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంయమనంతో పనులు చేసుకోవడం అవసరం. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
Advertisement
కన్య
కుటుంబ పెద్దల సహకారం పొందుతారు. తీర్థయాత్రలకు వెళ్ళవచ్చు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగులకు పనివారం పెరగవచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది.
తుల
ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. ఉద్యోగులు తోటి వారితో స్నేహంగా ఉంటూ పనులను పూర్తి చేసుకుంటారు. పదోన్నతి, ఉద్యోగంలో బదిలీలు ఉండవచ్చు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వృత్తిలో మంచి పేరు సంపాదిస్తారు.
వృశ్చికం
పాత బాకీలు వసూలు అవుతాయి. ప్రారంభించిన పనులను శ్రద్ధతో పూర్తి చేస్తారు. అందరి సహకారం లభిస్తుంది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆధ్యాత్మిక ప్రవచనాలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.
ధనుస్సు
ఉద్యోగులకు ఆఫీసులో తోటి వారితో స్నేహం పెరుగుతుంది. పై అధికారుల ఆదరణ లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపారం నిరాటకంగా కొనసాగుతుంది. రావాల్సిన సొమ్ము ఆలస్యంగా అందడంలో కొన్ని పనులు వాయిదా పడతాయి.
మకరం
శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్న వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. ఇంట, బయట సంతృప్తిగా ఉంటారు. కొత్త దుస్తులు, ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆఫీసులో అందరి సహకారం లభిస్తుంది.
కుంభం
కొత్త ఉద్యోగంలో చేరతారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఒక పక్కన బరువు, బాధ్యతలు పెరిగిన సంతృప్తిగా ఉంటారు. వ్యాపారులకు ఒప్పందాలు అనుకూలిస్తాయి. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు.
మీనం
పనులను శ్రద్ధతో పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం ఉన్న జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. సాహితీవేత్తలకు, కళాకారులకు అనుకూలం.