Advertisement
Weekly Horoscope in Telugu 2023: ఈ కాలంలో ప్రతి ఒక్కరూ ఈ వారం రాశి ఫలాలు చూసుకుంటున్నారు. అయితే, ఈ జ్యోతిష్యం ప్రకారం వ్యక్తులకు ప్రతి రోజూ ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేయవచ్చు. గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు భవిష్యత్తును అంచనా వేయగలరు. ఇలా మేషం నుంచి మీనం వరకు.. 30.04.2023 నుంచి 06.05.2023 ఎవరెవరికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఇప్పుడు చూద్దాం.
Advertisement
మేషం
అదృష్టం కలిసి వస్తుంది. శ్రద్ధగా పనులు చేస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. రోజు వారి వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. రాబడికి తగ్గట్టు ఖర్చులు ఉంటాయి. పనివాళ్లతో సమస్యలు ఏర్పడవచ్చు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి.
READ ALSO : శంకర్ – రామ్ చరణ్ ల ‘గేమ్ చెంజర్’ సినిమా పోస్టర్ లో ఇది గమనించారా ? ఇక్కడ ఉన్న లోగో వెనుక ఇంత అర్థం ఉందా ?
Today Horoscope in Telugu 2022
వృషభం
ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. అవకాశాలు వచ్చినట్టుగానే వచ్చి చేజారిపోతాయి. వారం చివర్లో శుభవార్త వింటారు. అపరిష్కృతంగా ఉన్న సమస్య తీరుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి.
మిథునం
అనుకున్న పనులు నెరవేరుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు, అధికారుల మన్ననలు అందుకుంటారు. అకాల భోజనం వల్ల అనారోగ్య సూచన. ఆర్థికంగా, మిశ్రమంగా ఉంటుంది. బాకీలు ఆలస్యంగా వసూలు అవుతాయి. బంధువులతో వాదోపవాదాలు చోటు చేసుకోవచ్చు.
కర్కాటకం
ఆదాయం పెరుగుతుంది. పెండింగ్ పనుల్లో కదలిక వస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పెద్దల అండదండలు ఉంటాయి. అనుభవజ్ఞుల సలహాలు పాటించడం వల్ల విజయం వర్తిస్తుంది. అన్నదమ్ములతో సఖ్యత నెలకొంటుంది. భూ లావాదేవీలు కలిసి వస్తాయి.
సింహం
చేపట్టిన పనులను జాగ్రత్తగా పూర్తి చేస్తారు. రోజువారి లావాదేవీలు సజావుగా సాగుతాయి. పనివారితో ఇబ్బందులు ఏర్పడవచ్చు. రుణ ప్రయత్నాలు చేయాల్సి రావచ్చు. బంధువులతో సఖ్యత ఉంటుంది. అన్నదమ్ముల సహకారం లభిస్తుంది. పెద్దల సలహాలను పాటించడం అవసరం.
Advertisement
కన్య
వారం మొదట్లో చికాకులు తలెత్తుతాయి. అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టపోవాల్సి వస్తుంది. వారాంతానికి పరిస్థితి కుదుటపడుతుంది. ఆరోగ్యం మందగిస్తుంది. ముఖ్యమైన పనులు కొన్నాళ్లు వాయిదా వేసుకోవడం మంచిది. ఆర్థికంగా కొన్ని చికాకులు తలెత్తుతాయి.
తుల
శ్రద్ధతో పనులు చేస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆదాయం పెరుగుతుంది. అన్నదమ్ములు, బంధువులతో సఖ్యతతో ఉంటారు. తీర్థయాత్రలకు వెళ్తారు. రోజువారి వ్యాపారంలో ఒడిదొడుకులు రావచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడులు కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిది.
వృశ్చికం
నలుగురిలో పేరు సంపాదిస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. పెద్దల సలహాలను పాటించడం అవసరం. ఆర్థిక సమస్యలు క్రమేపి దూరమవుతాయి.
ధనుస్సు
అన్నదమ్ములు, బంధువులు, స్నేహితులతో మంచి సంబంధాలు ఉంటాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కొత్త వస్తువులు కొనడంపై మనసు నిలుపుతారు. ప్రయాణాల వల్ల అలసట ఏర్పడుతుంది. పని వారితో సమస్యలు రావచ్చు.
మకరం
అనుకూల వాతావరణం ఉంటుంది. అన్ని విషయాలను చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. పనిభారం పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవలసి రావచ్చు. సంఘంలో పలుకుబడి మూలంగా పనులు పూర్తవుతాయి.
కుంభం
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. చదువులో రాణిస్తారు. మంచి సంస్థలో చేరతారు. రావాల్సిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది. భక్తి పెరుగుతుంది. ఇంట్లో అనుకూల వాతావరణ ఉంటుంది. పనులలో శ్రమ పెరుగుతుంది.
మీనం
కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కార్య సాఫల్యం ఉంది. శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారాన్ని పొందుతారు. ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. బంధుమిత్రులతో చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు.
READ ALSO : Nani Dasara Movie Review in Telugu: నాని “దసరా” మూవీ రివ్యూ & రేటింగ్.. హిట్ కొట్టినట్టేనా..?