• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » Weekly Rashi Phalalu in Telugu : వీక్లీ రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి శుభవార్త

Weekly Rashi Phalalu in Telugu : వీక్లీ రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి శుభవార్త

Published on August 29, 2022 by Bunty Saikiran

Advertisement

వృత్తి వ్యాపారాలు చేసే వృషభ రాశి వారికి ఆర్థికంగా ఇది ఎంతో అనుకూల సమయం. మీన రాశి వారు ఉద్యోగం మారే విషయంలో మోసపోయే అవకాశం ఉంది. వీటి వివరాలతో పాటు అన్ని రాశుల వారిగా వార ఫలాలు ఎలా ఉన్నాయంటే!

 

మేషరాశి: బాధ్యతలు ఎక్కువగా ఉన్న ఒక మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. బంధు వర్గంలో వివాహ సంబంధం కుదురుతుంది. స్థలం గాని, ఇల్లు గాని కొనే అవకాశం ఉంది. రుణ బాధ తగ్గుతుంది. ఆదాయం పెరుగుతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు.

 

వృషభ రాశి: ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. అదృష్ట యోగం పట్టబోతోంది. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. విదేశీ సంస్థలలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న సంతానం విజయాలు సాధిస్తారు. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు సంభవం. సంతాన యోగానికి అవకాశం ఉంది.

 

మిధున రాశి: ఈ వారం చాలావరకు సాఫీగానే సాగిపోతుంది. ఉద్యోగానికి సంబంధించి పెద్ద సంస్థల నుంచి ఆఫర్లు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కానీ అందుకు తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. విహార యాత్రలకు వెళతారు. వ్యాపారం ప్రారంభించాలనే నిర్ణయానికి వస్తారు.

కర్కాటక రాశి: సంతానం గురించి శుభవార్త వింటారు. వీరిలో ఒకరికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం పరవాలేదు. మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు. అనుకోని ఖర్చులు మీద పడతాయి. సప్తమ శని కారణంగా కొన్ని పనులు ఆలస్యం కావచ్చు.

 

సింహరాశి: భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించడానికి ప్రయత్నాలు సాగిస్తారు. స్వగృహం కలిగి ఉండాలన్న మీ చిరకాల వాంఛ ఫలిస్తుంది. ఆధ్యాత్మిక చింతనతో ఆలయాలు సందర్శిస్తారు. ఫ్లాటును గాని సమకూర్చుకుంటారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది.

 

కన్యరాశి: ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. పిల్లల్లో ఒకరికి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఇల్లు కొనే ప్రయత్నం చేస్తారు. మంచి రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి చాలా బాగుంటుంది. కుటుంబ సభ్యులు సహాయ సహకారాలు అందిస్తారు. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది.

Advertisement

తులారాశి: ఈవారం మీకు ఇంట, బయట బాగా ఒత్తిడి ఉంటుంది. రాజకీయ పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కోర్టు కేసు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం తీరు ఆందోళన కలిగిస్తుంది.

 

వృశ్చిక రాశి: ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి దూర ప్రాంతం నుంచి మంచి ఆఫర్ వస్తుంది. వ్యాపార, విద్య, వైద్య రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆదాయం పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. స్థలం గాని, ఇల్లు గాని కొంటారు. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. పిల్లల్లో ఒకరికి స్వల్పంగా అనారోగ్యం కలిగే సూచనలున్నాయి.

 

ధనస్సు రాశి: ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. సంపాదనకు అన్ని విధాల అనుకూలమైన సమయం. ఇల్లుకొనే ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఇల్లు సందడిగా ఉంటుంది. త్వరలో పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో రాణిస్తారు. గణితం, కంప్యూటర్ విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు.

మకర రాశి: రాజకీయ, సామాజిక కార్యకలాపాల్లో విరివిగా పాల్గొంటారు. కొన్ని ముఖ్యమైన సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఏలినాటి శని ప్రభావం కారణంగా మధ్యమధ్య అనారోగ్య బాధలు, శ్రమ తప్పవు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

 

కుంభరాశి: ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఇబ్బందుల్లో ఉన్న స్నేహితులకు బాగా ఆర్థిక సహాయం అందిస్తారు. ఏలినాటి శని కారణంగా మధ్యమధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యం జరిగే సూచనలున్నాయి.

 

మీన రాశి: ఈ వారం ఆర్థిక పరిస్థితి చాలా వరకు నిలకడగా ఉంటుంది. ఇల్లు మారతారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. తలచిన పనులు పూర్తవుతాయి. స్నేహితులు ఇబ్బందులకు గురిచేస్తారు. రెండో ఆదాయ మార్గం గురించి ఆలోచిస్తారు. అప్పులు తీరుస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది.

Advertisement

also read: అమ్మాయిలు ఎక్కువగా ఎలాంటి విషయాలను వినడానికి ఇష్టపడతారు !

Latest Posts

  • రాహుల్ గాంధీకి లైన్ క్లియర్ అయినట్టేనా?
  • అమిత్ షా ను కలుస్తానన్న కోమటిరెడ్డి.. ఎందుకు?
  • శ్రీదేవి రాజశేఖర్ పెళ్లిని అడ్డుకున్నది ఎవరో తెలుసా..?
  • వెన్నునొప్పులతో బాధపడుతున్నారా..ఈ చిట్కాలు పాటించాల్సిందే..?
  • ఉదయాన్నే ఇవి తింటున్నారా.. అయితే ప్రమాదమే..!!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd