Advertisement
వృత్తి వ్యాపారాలు చేసే వృషభ రాశి వారికి ఆర్థికంగా ఇది ఎంతో అనుకూల సమయం. మీన రాశి వారు ఉద్యోగం మారే విషయంలో మోసపోయే అవకాశం ఉంది. వీటి వివరాలతో పాటు అన్ని రాశుల వారిగా వార ఫలాలు ఎలా ఉన్నాయంటే!
Advertisement
మేషం :- రాజకీయ నాయకులకు దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి పనిలో ఒత్తిడి, చికాకులు తప్పవు. స్త్రీలకు పొట్ట, బి.పి., నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కుంటారు. ఊహించని సంఘటనలు వల్ల మనస్తాపం చెందుతారు. సోదరీ, సోదరులతో సంబంధ, బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. విద్యా, సంస్కృతిక కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ ధ్యేయం నెరవేరుతుంది.
వృషభం:
బంధుమిత్రుల వ్యాఖ్యలు ఉద్రేక పరుస్తాయి. సంయమనం పాటించండి. వ్యతిరేకించిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. అవసరాలకు సర్దుబాటవుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సోమ, మంగళ వారాల్లో ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. కొత్త వ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సంతానం కదలికలపై దృష్టి సారించండి.
మిథునం:
ఈ వారం అనుకూలదాయకం. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పెట్టుబడులపై దృష్టి పెడతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. సంతానం విషయంలో శుభం జరుగుతుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు.
కర్కాటకం:
ఆర్థిక లావాదేవీలు కొలిక్కి వస్తాయి. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పెట్టుబడులపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. పనులు అర్ధాంతంగా ముగిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. సంతానం, చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. పరిచయాలు జ్ఞాపకాలు విస్తరిస్తాయి.
సింహం:
లక్ష్యసాధనకు ఓర్పు ప్రభావం. అవకాశాలు చేజారిపోతాయి. ఏది జరిగిన ఒక అందుకు మంచిదే. ఆత్మీయుల వ్యాఖ్యలు ఉపశమనం కలిగిస్తాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఎదురు చూస్తున్న పత్రాలు అందుకుంటారు. పనులు వేగవంతం అవుతాయి.
Advertisement
కన్య:
చాకచక్యంగా వ్యవహరిస్తారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఖర్చులు అధికం. అవసరాలకు ధనం అందుతుంది. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. శుక్ర, శనివారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుపడదు. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సంతానం విషయంలో విషయాల్లో మంచి జరుగుతుంది. మానసికంగా కుదుటపడతారు.
తుల: అవిశ్రాంతంగా శ్రమిస్తారు. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయం సంతృప్తికరం. రోజువారి ఖర్చులే ఉంటాయి. పరిచయస్తులు ధన సహాయం ఆర్తిస్తారు. కొంత మొత్తం సాయం అందించండి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. గృహ మార్పు అనివార్యం. సోమ, మంగళవారాల్లో ఫోన్ సందేశాలను నమ్మవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించే ఆస్కారం ఉంది. ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగేయాలి.
వృశ్చికం:
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. ప్రతికూలతలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. కొంత మొత్తం ధనం అందుతుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. సంప్రదింపులు ఫలిస్తాయి. వ్యవహారాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. బుధవారం నాడు పత్రాలు, నగదు జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆత్మీయుల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు.
ధనస్సు:
మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. మీ కష్టం వృధా కాదు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. ఆదాయం బాగుంటుంది. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. గురు, శుక్రవారాల్లో పొగిడే వారితో జాగ్రత్త. అంతరాంగిక విషయాలు వెల్లడించవద్దు. వివాహయత్నం ఫలిస్తుంది. నిశ్చితార్థంలో మెలకువ వహించండి. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది.
మకరం:
ఆర్థిక స్థితి ఆశాజనకం. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. ఖర్చులు భారం అనిపించవు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పనులు వేగవంతం అవుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. శనివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది.
కుంభం:
కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఆచితూచి అడగేయాలి. ప్రలోభాలకు లొంగవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఆది, సోమవారాల్లో పట్టుదలతో శ్రమించిన గాని పనులు పూర్తి కావు. దంపతుల మధ్య సఖ్యత లోపం. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు.
మీనం:
మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు పరిచయాలు బలపడతాయి. ఆదాయవ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలకు ధనం అందుతుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి.
READ ALSO : వీసా లేకుండా భారతీయులు ఎప్పుడైనా వెళ్లగలిగే దేశాలు ఇవే!