Advertisement
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో ఆంధ్రప్రదేశ్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ఇప్పటికే టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. కొన్ని చోట్ల చంద్రబాబు నాయుడు అరెస్ట్ కి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. తాజాగా ఈ అంశంపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రతిపక్ష నేతలపై కక్ష్య సాధింపులపై పాల్పడే సీఎం ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం అని పేర్కొన్నారు. తాను 16 నెలలు జైలులో ఉన్నాను. చంద్రబాబు నాయుడిని 16 నిమిషాలు అయిన జైలులో పెట్టాలనేది తన జీవిత లక్ష్యం అన్నట్టు జగన్ కక్ష్య సాధిస్తున్నారని ఆరోపించారు. స్కిల్ డెవలఫ్ మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడిని ఏ చట్టం ప్రకారం.. అరెస్ట్ చేశారంటూ ప్రశ్నించారు. స్కిల్ డెవలప్ మెంట్ పెద్ద కుంభకోణమని ప్రచారం తప్ప ఇందులో వాస్తవం లేదన్నారు. కావాలని రాజకీయ కక్ష్యతో చేస్తున్న కుట్ర అన్నారు.
Advertisement
Advertisement
ఒకవేళ 19/12/2021 లో ఎఫ్ఐఆర్ నమోదు అయిందని అంటున్నారు.. వాస్తవానికి అవినీతి జరిగి ఉంటే ఇంతవరకు ఎందుకు ఛార్జీ షీట్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. డిజైన్ టెక్ సంస్థ అకౌంట్లు ప్రీజ్ చేసి నిధులు స్థంభింపజేసినప్పడు కోర్టు మీకు చీవాట్లు పెట్టి ఆ డబ్బు నేరానికి సంబంధించి కాదని ఆదేశాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా..? అన్నారు. 2.13 లక్షల విద్యార్థులకు శిక్షణ ఇచ్చి 72వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారని.. దీనికి కుంభకోణి ఏవిధంగా అంటారని.. స్వయంగా హైకోర్టు చెప్పలేదా అని వ్యాఖ్యానించారు. మళ్లీ తప్పుల మీద తప్పులు చేసి కోర్టుల చేత ఎందుకు తిట్లు తింటారు అన్నారు. సీఎం జగన్ సీఎం అయ్యాక అన్నం తినడం మానేసి.. కోర్టుల చేత ఛీవాట్లు తింటున్నారని ఆరోపణలు చేశారు.