Advertisement
SS.Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లారు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి నెక్స్ట్ సినిమా కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఆలోపే రాజమౌళి పై మోడ్రన్ మాస్టర్స్ అనే డాక్యుమెంటరీని తీసుకొచ్చారు. రాజమౌళి డాక్యుమెంటరీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ డాక్యుమెంటరీలో రాజమౌళికి క్లోజ్ గా ఉండే వాళ్ళందరూ ఆసక్తికరమైన విషయాలని పంచుకున్నారు. రాజమౌళి షూటింగ్ లేకపోతే ఖాళీగా ఉంటే ఏం చేస్తారో రాజమౌళి, ఆయన భార్య రమా రాజమౌళి ఇద్దరు తెలిపారు.
Advertisement
రామ రాజమౌళి మాట్లాడుతూ షూటింగ్ లేకపోతే రాజమౌళి బద్ధకంగా ఉంటారని, నిద్రపోరు కానీ ఖాళీగా కూర్చుంటారని, ఏదో ఆలోచిస్తూ ఉంటారని అన్నారు. ఒక్కోసారి ఆ బద్ధకం పోగొట్టుకోవడానికి బయటకు వెళ్లి గేమ్స్ ఆడుతారని చెప్పారు. నిజానికి రాజమౌళి చాలా లేజీగా ఉంటారని అన్నారు.
Advertisement
Also read:
రాజమౌళి దీనిపై స్పందిస్తూ నాకు స్పోర్ట్స్ మెడిటేషన్ లాంటిదని అన్నారు. వాలీబాల్ క్రికెట్ ఇలా పలు గేమ్స్ ఆడతానని అన్నారు. ఖాళీగా ఉన్నప్పుడు వ్యవసాయం, గేమ్స్, కుటుంబము, సెలవల గురించి ఆలోచిస్తాను అని అన్నారు దీంతో రాజమౌళికి కూడా బద్ధకం ఎక్కువేని అందరూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!