Advertisement
పూర్వకాలంలో ఎలాంటి టెక్నాలజీ లేదు కాబట్టి ఏదైనా సమాచారం ఇతరులకు తెలపాలి అంటే నేరుగా వీరు వెళ్లి అయినా చెప్పాలి, లేదంటే సమాచారం చేరవేయడానికి కొంతమందిని ప్రత్యేకంగా నియమించుకునే వారు. ఈ విధంగా సమాచారాన్ని అనేది వారి బంధువుల కానీ, స్నేహితుల కానీ తెలిపేవారు. కొంతమంది దూర దేశాలకు వెళ్లి వారి యోగక్షేమాలు తెలపాలి అంటే ఉత్తరాల ద్వారా తెలియజేసేవారు. వారు వెళ్లిన కంట్రీ నుండి ఉత్తరం రాస్తే కనీసం నెల రోజులకు వారి ఇంటికి చేరేది.
Advertisement
ఇంట్లోని వారు ఆ ఉత్తరం చదివి ఆయన యోగక్షేమాలు తెలుసుకునేవారు. మళ్లీ వీరు మరొక ఉత్తరం మాకు అందిందని మేము అంతా కుశలమే అని రాసేవారు. ఈ విధంగా ఉత్తరాలు కూడా కాలక్రమేణా కనుమరుగైపోయాయి. తర్వాత ఫోన్ లు వచ్చాయి. ఈ ఫోన్ ల ద్వారా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇంట్లోనే కూర్చుని ఏ విషయమైనా మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది. మరి మనం ఫోన్ మాట్లాడినప్పుడు ముందుగా హలో అని అంటాం.. మరి హలో అంటే ఏమిటి ఆ పదం ఎలా వచ్చిందో ఓ సారి చూద్దాం. ప్రస్తుత కాలంలో తిండి ఉన్న లేకున్నా ఉంటారు కానీ సెల్ఫోన్ లేకుండా ఉండే పరిస్థితి లేదు. చదువుకున్న వారి నుంచి చదువు లేని వారి వరకు ఫోన్ అలా రింగ్ అవ్వగానే హలో అంటారు.
Advertisement
హలో వెనక ఒక ప్రత్యేకమైన విషయం దాగి ఉంది. అదే ఏంటయ్యా అంటే హలో అంటే ఒక అమ్మాయి పేరు, ఆమె పూర్తి పేరు మార్కెరిట్ హలో , ఈమె ఫోన్ కనిపెట్టిన గ్రహంబెల్ ప్రేయసి. గ్రహంబెల్ ఫోన్ కనిపెట్టిన కొత్తలో మొదటి సారి ఫోన్ మాట్లాడినప్పుడు హలో అని సంబోదించారట. ఆ పదం అలాగే ఇప్పటివరకు నడుస్తూనే ఉంది. గ్రహంబెల్ ఫోన్ కనిపెట్టిన సమయంలో సొంత స్వార్ధానికి పోకుండా ప్రేయసి పేరునే తలుసుకున్నాడు. ఈ విధంగా హలో అనే పదం ఇప్పటికీ వాడుకలో ఉంటోంది.
also read: