Advertisement
చాలామంది పెద్దవాళ్లు నలుపు బట్టలు వేసుకోవద్దని అంటారు. మామూలు టైంలో కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. కొంతమంది స్పెసిఫిక్ గా ఏదైనా ఫంక్షన్ లో లేదా పండగల టైంలో నల్లటి రంగులో ఉండే బట్టలు వేసుకోవద్దు అని చెప్తూ ఉంటారు. అసలు ఎందుకు నల్లటి బట్టలు వేసుకోకూడదు అని వెనుక కారణం ఏంటి అనేది చూద్దాం.. ఈ ప్రకృతి ఎన్నో రంగులతో నిండి ఉంది అందుకే మన చుట్టూ ఎన్నో రంగులు ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతులు మతాల్లో ప్రతి రంగుకి వేరు వేరు అర్ధాలు ఉన్నాయి. హిందూ మతంలో నలుపుకి ఉన్న ప్రాముఖ్యత ఏంటనే విషయాన్నికి వచ్చిస్తే.. నలుపు రంగుని చాలా మంది ఇష్టపడుతుంటారు అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఎక్కువగా నల్లటి వస్తువులని నల్లటి దుస్తుల్ని కూడా వాడుతుంటారు.
Advertisement
Advertisement
హిందూమతంలో నలుపు రంగని పవిత్రంగా పరిగణించరు. హిందూమతంలో పెళ్లి అయిన తర్వాత ఒక ఏడాది పాటు నలుపు రంగు ని అస్సలు వేసుకోరు. బ్లాక్ కలర్ బట్టలు వాచ్ లను పెట్టుకోవడం వలన చెడు శకునాలు వస్తాయని అంటూ ఉంటారు జ్యోతిష్యం ప్రకారం నలుపు రంగు శనితో ముడిపడి ఉంది. మనలో చాలామంది బ్లాక్ వాచ్ లని పెట్టుకుంటూ ఉంటారు. జాతకంలో శని స్థానం చూసి కొన్ని సార్లు జ్యోతిష్యులు నలుపు రంగు ధరించమని సలహా ఇస్తారు. జాతకంలో శని దేవుడు మంచి స్థానంలో ఉంటే డబ్బు కీర్తి కలుగుతాయి. అందుకని నల్లటి వాటిని వేసుకోవద్దని అంటూ ఉంటారు.
దీపావళి సంక్రాంతి దసరా ఇలా ప్రత్యేక పండగలు వచ్చినప్పుడు నలుపు రంగు బట్టలు వేసుకోకూడదని అంటూ ఉంటారు. గుడికి వెళ్ళినప్పుడు పెద్ద వేడుకలప్పుడు కూడా నల్లటి వాటిని వేసుకోవద్దని చెప్తూ ఉంటారు. బ్లాక్ కలర్ సాధారణంగా దుఃఖంతో ముడిపడి ఉంటుందని చాలా మంది నమ్ముతారు. అందుకని శుభకార్యాలప్పుడు పండగలప్పుడు నల్లటి వాటిని వేసుకోరు. నలుపు రంగు మరణం చీకటికి ప్రతీకగా భావిస్తారు చెడు కంటిచూపు పడకుండా ఉండేందుకు కూడా దీనిని ఉపయోగిస్తారు. అయితే నల్లటి బట్టలు వేసుకోకూడదు కానీ చిన్నపిల్లలకి చెడు దృష్టి పడకుండా ఉండడానికి కాటుకతో బొట్టు పెడతారు సోమవారం మంగళవారం నలుపు రంగు బట్టలు చాలా మంది వేసుకోరు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!