Advertisement
గర్భిణీలు హెల్తీగా ఉండడానికి అనేక రకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. చాలామంది కుంకుమపువ్వుని కూడా తీసుకుంటూ ఉంటారు. కడుపుతో ఉన్నప్పుడు కుంకుమపువ్వు తీసుకోవడం వలన ఏమవుతుంది..? ఎలాంటి మార్పులు వస్తాయి అనేది చూద్దాం. తొలి 3 నెలలు కుంకుమపువ్వు తీసుకోకూడదు. అలా చేస్తే నొప్పి పెరగడం వంటి సమస్యలు వస్తాయి. కుంకుమ పువ్వు తీసుకోవడానికి ఏడవ నెల మంచి సమయమని చెప్పొచ్చు. ఏడవ నెల నుంచి గర్భంలో బిడ్డ ఎదుగుదల బాగుంటుంది. అందుకనే అప్పటి నుంచి కుంకుమపువ్వు తీసుకోవాలి.
Advertisement
నాలుగవ నెల నుంచి తీసుకున్నా కూడా ఏం పర్వాలేదు. కుంకుమ పువ్వుని తీసుకోవడం వలన చాలా సమస్యల నుంచి సులువుగా బయటపడొచ్చు. మంచి నిద్ర పట్టడానికి ఇది హెల్ప్ చేస్తుంది. గర్భం దాల్చినప్పుడు శరీరంలో హార్మోన్స్ సమస్యలు వస్తాయి. వాటిని ఇది తొలగిస్తుంది. అలాగే మచ్చలు, మొటిమలు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. గర్భం దాల్చినప్పుడు హార్మోన్స్ మార్పు వలన మూడ్ స్వింగ్స్ కూడా ఎక్కువగా వస్తాయి.
Advertisement
Also read:
చిరాకు, కోపం వంటివి కలుగుతాయి. అలాంటప్పుడు కుంకుమపువ్వు సహాయ పడుతుంది. అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో కొంతమందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు కుంకుమపువ్వు సహాయం చేస్తుంది. దీన్ని ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. ఎక్కువ మోతాదులో కుంకుమపువ్వు తీసుకుంటే విరోచనాలు వంటివి కలుగుతాయి. ప్రెగ్నెన్సీ సమయంలో రోజుకి 1.5 గ్రాముల కుంకుమపువ్వు తీసుకుంటే సరిపోతుంది అంతకంటే ఎక్కువ తీసుకోవడం వలన నష్టాలు వస్తాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!