Advertisement
ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం అందమైన దశ. కల్మషం లేని పిల్లలు ఆటపాటలతో సరదాగా గడుపుతారు. పిల్లల చేష్టలు కొన్ని కొన్ని సార్లు తల్లిదండ్రులకి చికాకు, కోపాన్ని తీసుకువస్తాయి. అయితే పిల్లల్ని మాత్రం అస్సలు చుట్టాల ముందు ఎప్పుడూ తిట్టకూడదు. అలా చేయడం వలన పిల్లలకి కోపం రావడమే కాకుండా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా సమస్యలు వస్తాయి. పిల్లలు మనసు చాలా మెత్తగా ఉంటుంది. పిల్లల్ని ఎలా పెంచితే అలానే తయారవుతారు. పిల్లలు ఏ విషయాన్నైనా సులువుగా స్వీకరిస్తారు. పేరెంట్స్ పిల్లల్ని అందరి ముందు తిడితే వారి మనసుపై చెడు ప్రభావం పడుతుంది. అందరి ముందు పిల్లలను తిట్టడం వలన పిల్లలకి కోపం వస్తుంది.
Advertisement
Advertisement
బాగా మొండిగా ప్రవర్తిస్తారు, కాబట్టి ఎప్పుడూ ఆ తప్పు చేయకూడదు, అలాగే బయట వ్యక్తులు ముందు పిల్లల్ని తిట్టడం వలన పిల్లల మానసిక ఆరోగ్యమే మాత్రమే శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఎన్నో రకాల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. పిల్లలు తరచుగా అనారోగ్యానికి గురవడం వలన పిల్లల శారీరక ఎదుగుదల తగ్గుతుంది. తల్లిదండ్రులు తిట్లు, కోపం పిల్లల శారీరక బలహీనతకు దారితీస్తాయి.
Also read:
తల్లిదండ్రులకు పిల్లలు ఒత్తిడికి గురవుతున్నట్లుగా కూడా తెలియదు. ఈ ఒత్తిడి వలన పిల్లలకు స్కూల్లో సమస్యలు వస్తాయి. స్నేహితులు మధ్య గొడవలు వస్తాయి. పిల్లల్ని ఇతరుల ముందు తిట్టడం వలన అగ్నికి ఆద్యం పోసినట్లు అవుతుంది. అందరి ముందు పిల్లల్ని తిట్టడం వలన చెడుగా ప్రవర్తించే ప్రమాదం ఉంటుంది. క్రమశిక్షణ లేకుండా పోతుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!