Advertisement
బార్ కోడ్ అంటే ఒక ప్రత్యేకమైన టువంటి వస్తువులపై తెలుపు మరియు నలుపు లైన్లను కలిగి ఉన్న వాటిని బార్ కోడ్ అని పిలుస్తారు. వివిధ రకాల స్థాయిలలో ఉండే ఈ బార్ కోడ్స్ ఏదైనా స్కానర్ ను ఉపయోగించి స్కాన్ చేస్తే ఆ కోడ్ కు సంబంధించి అందులో ఏం పెట్టారో అది మనకు చూపిస్తుంది. ఎక్కువగా ఈ బార్ కోడ్ లను షాపింగ్ మాల్స్, రిలయన్స్ మార్ట్ వంటివాటిలో ఉపయోగిస్తూ ఉంటారు. ఈ తెలుపు మరియు నల్లని పట్టీల లైన్లలో సమాచారం నిక్షిప్తమై ఉంటుంది.
Advertisement
Advertisement
వస్తువుకు సంబంధించిన సమాచారాన్ని అందులో ఎన్ కోడ్ చేసి ఉంచుతారు. ఈ బార్ కోడ్ లో ఉండే సమాచారాన్ని మనం నేరుగా చదివి అర్థం చేసుకోలేం. దీన్ని తయారు చేసినటువంటి బార్ కోడ్ రీడర్స్ లేదా స్కానర్ మాత్రమే చదవగలుగుతారు. ఆటోమేటిక్ మెషిన్ లలో స్కానింగ్ చేసిన వెంటనే అందులో ఉండే బార్ కోడ్ రీడ్ చేయబడుతుంది. ఆ సమాచారాన్ని అవసరమైతే కంప్యూటర్ కు పంపించుకునే అవకాశం కూడా ఉంటుంది.
ఉదాహరణకు మనం ఎప్పుడైనా సూపర్ మార్కెట్ వెళ్ళినప్పుడు ఏదైనా వస్తువు తీసుకున్న వెంటనే వారు ఆ వస్తువుపై ఉన్న బార్కోడ్ పై స్కాన్ చేయగానే దానిపై ఉన్న ధర వారికి పడుతుంది. దానికి సంబంధించిన సమాచారం కంప్యూటర్లోకి వస్తుంది.ఈ విధంగా బార్కోడ్ ను ఉపయోగించి మార్కెట్లలో దాని ధర అయితే ఈజీగా తెలుసుకుంటారు. అయితే ఇది ఏ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్, ఆయా కంపెనీకి సంబంధించిన బార్కోడ్లను వేసుకుంటుంది.