Advertisement
ప్రతిసారి కూడా ఆషాడ మాసం వచ్చిన తర్వాత శ్రావణమాసం వస్తుంది. తెలుగు సంవత్సరాది ప్రకారం ఈసారి మాత్రం రెండు శ్రావణ మాసాలు వచ్చినట్లు జ్యోతిష్యులు అంటున్నారు. ఆషాడ మాసం తర్వాత శ్రావణ మాసం వస్తుంది. శ్రవణ మాసంలో మహిళలు పూజలు, వ్రతాలు, నోములు వంటివి చేసుకుంటూ ఉంటారు. అయితే ఆషాడం తర్వాత ఈసారి అధిక శ్రావణమాసం వచ్చింది. అధిక మాసం అయిన తర్వాత అసలు శ్రావణమాసం వస్తుంది.
Advertisement
ఆ శ్రావణ మాసం లోనే పూజలు, వ్రతాలు, నోములు వంటివి జరుపుకోవాలి. అయితే ఈసారి ఎందుకు ఇలా అధికమాసం వచ్చింది..? ఈ అధిక మాసంలో ఏం చేయాలి..? ఏం చేయకూడదు అనేది తెలుసుకుందాం.. నెలకి 30 లేదా 31 రోజులు ఉంటాయి. ఇలా సంవత్సరానికి 365 రోజులు. తెలుగు నెలలని మాత్రం చాంద్రాయానంను సూర్య, చంద్రుల కాలగణన ఆధారంగా లెక్కిస్తారు.
Advertisement
అయితే చంద్రాయానంలో నెలలో 29.53 రోజులే వస్తుంటాయి. ఈ లెక్కన సంవత్సరానికి 11 రోజులు తేడా. నాలుగు సంవత్సరాలకు 31 రోజులు ఎక్కువ వస్తాయి. ఇలా వస్తేనే అధికమాసం అంటారు. 32 నెలల తర్వాత వచ్చే ఈ మాసాన్ని అధికంగా వస్తుంది. 2020లో సెప్టెంబర్ 18 నుంచి అధిక మాసం మొదలైంది. ఇప్పుడు 2023 జూలై 18 నుంచి అధిక మాసం స్టార్ట్ కానుంది.
ఈసారి అధికంగా శ్రావణ మాసం ఏర్పడుతుంది. అసలు శ్రావణ మాసం ఆగస్టు 17 గురువారం నుంచి 15 సెప్టెంబర్ 2023 వరకు. ఈ సమయంలోనే మనం నోములు, పూజలు చేసుకోవాలి. అయితే ప్రత్యేక పూజలు చేయకపోయినా ఈ మాసం మహావిష్ణువుకు ఇష్టం కనుక విష్ణు సహస్రనామాలు పఠించడం, పితృఆరాధన మంచిది. దాన ధర్మాలు చేస్తే కూడా మంచిదే.
Also read: