Advertisement
1938లో నెహ్రూ, మహాత్మా గాంధీ మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించారు. అప్పుడు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని ఉద్దేశంతో 1942లో దీనిపై ఇంగ్లాండ్ సర్కార్ నిషేధం విధించింది. తర్వాత 1945 లో పత్రిక తిరిగి ప్రారంభమైంది. ఆ సమయంలో పత్రిక కష్టాల్లో ఉండేది. దీంతో పత్రిక నడిచేందుకు కాంగ్రెస్ పార్టీ కాస్త ఆర్థిక సహాయం చేసింది. అప్పటినుంచి అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పత్రిక సాగేది. అనేక అవాంతరాలు ఎదుర్కొంటూ సాగిన పత్రిక 2008లో తిరిగి మూతపడింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి పత్రిక నిర్వహణ సంస్థ అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ 90 కోట్లు బాకీ పడింది.
Advertisement
ఈ సంస్థ ఆస్తులు మరియు బకాయిలపై కాంగ్రెస్ పార్టీ దృష్టిసారించింది. అదే సమయంలో 2010లో 50 లక్షల మూలధనం తో… యంగ్ ఇండియన్ లిమిటెడ్ అనే కంపెనీని కాంగ్రెస్ నేతలు స్థాపించారు. ఇందులో సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీ చెరో 38 శాతం వాటా కలిగి ఉన్నారు. వీరితోపాటు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండేజ్, శ్యామ్ పిట్రోడా, సుమను 5000 మిగతా 24 శాతం వాటా కలిగి ఉన్నారు. ఏ జె ఎల్ బకాయిలు తీర్చడానికి ఈ సంస్థను సోనియాగాంధీ, రాహుల్గాంధీ వాటా కలిగి ఉన్న వై ఎల్ ఐ సంస్థకు విక్రయించారు.
Advertisement
ఈ కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయని, ఏ జే ఎల్ ఆస్తులు దక్కించుకునేందుకు కాంగ్రెస్ మోసపూరితంగా వ్యవహరించిందని ఆరోపణలు వచ్చాయి. దాదాపు 2 వేల కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఆరోపణలు చేశారు. ఆయన ఈ అంశంపై కోర్టులో ఫిర్యాదు కూడా చేశారు. 2014లో ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. దీనిపై అప్పట్లోనే స్టే తెచ్చుకున్నారు. ఈ సంస్థకు సంబంధించిన 64 కోట్లను 2019లో ఈడీ అటాచ్ చేసింది. అలాగే తమపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టును సోనియా గాంధీని ఆశ్రయించారు. అప్పటినుంచి సాగుతున్న ఈ కేసులో తాజాగా సోనియా మరియు రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది.
also read;