Advertisement
రాజకీయాల వివాదం మరో మలుపు తిరుగుబోతుందా..? ఇన్నాళ్లు మూడు రాజధానులు అని అన్నారు. అయితే ఇప్పుడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ని మరి కొన్నాళ్ళు కొనసాగించాలని కోరుకోవడం ఏంటి..? అందుకు కారణం ఏంటి..? వైసిపి కీలక నేత వైవి సుబ్బారెడ్డి చేసిన కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి..? హైదరాబాదే రాజధాని అన్న సెంటిమెంట్తో ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేయబోతున్నారా..? సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా మనం తీసుకోవాలి..? వై వి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు వెనుక ఉన్న ప్లాన్ ఏంటి అనేది చూస్తే.. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ని కొనసాగించాలని హైదరాబాద్ వైసిపి సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి కామెంట్స్ చేశారు.
Advertisement
తెలుగువారి రాజధాని నగరం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్న విషయం అందరూ మర్చిపోతున్న దశలో ఈయన చూసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. మరికొద్ది రోజుల్లో ఏపీ అసెంబ్లీతో పాటుగా పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈయన చేసిన వ్యాఖ్యలు వెనుక పక్క ప్లాన్ ఉందని అందరూ అంటున్నారు. 2014లో రాష్ట్ర విభజన టైం లో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని నిర్ణయించింది కేంద్రం. పదేళ్లపాటు ఏపీ రాజధానిగా హైదరాబాద్ నుండి కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు అని విభజన చట్టంలో చాలా క్లియర్ గా ఉంది ఈ ఏడాది జూన్ వరకు ఈ గడువు ఉంది. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం 2015లో అమరావతిని రాజధానిగా ప్రకటించింది.
Advertisement
తర్వాత కొద్ది నెలల్లోనే హైదరాబాద్ నుండి అమరావతికి మకం మార్చింది. 2019లో టిడిపి ప్రభుత్వం గద్దె దిగిన వెంటనే వైసీపీ ప్రభుత్వం అమరావతి స్థానంలో మూడు రాజధానుల అంశాన్ని తీసుకొచ్చింది ఈ టైంలోనే హైదరాబాద్ నగరంలో ఉన్న ఏపీ భవనాలను అన్నిటిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జగన్ సర్కార్ అప్పగించింది. అయితే మరికొన్ని రోజుల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఏపీలో రాజధాని లేకపోవడంతో హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా కొనసాగించుకోవాలని కోరుకోవడం దుమారం రేపుతోంది. ఇంకో 60 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా తెరమీదకి లేపడం కేవలం ఎన్నికల ఎత్తుకడగా పరిశీలకులు అనుమాన పడుతున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు వెనక రాజకీయ వ్యూహం అందరికీ కనబడుతోంది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పై పంచాయతీ నడుస్తోంది ఈ తరుణంలో హైదరాబాద్ని వివాదం చేయడం ద్వారా ప్రజల్లో భావోద్వేగం కలిగేలా చేసి ఓట్లుగా మలుచుకోవాలని చూస్తోందని విపక్షం అంటోంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!