Advertisement
నారా లోకేష్ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లో మార్పు చేయడం ద్వారా లోకేష్ లబ్ది పొందారు అంటూ.. సిబిఐ ఆయనపై అభియోగం మోపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నారా లోకేష్ చిక్కుకున్నారు అంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. ఈ కేసులో అసలు విషయం ఏమిటో ఇప్పుడు చదవండి. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లో మార్పు చెయ్యడం వల్లే లింగమనేని భూముల ధరలు రూ.700 కోట్ల రూపాయల ధర పెరిగిందని, అప్పటి మంత్రిగా ఉన్న నారాయణతో పాటు హెరిటేజ్ సంస్థకి కూడా లాభం చేకూరింది అని సిబిఐ పేర్కొంది.
Advertisement
ఇవి కూడా చదవండి: జైలు జీవితం గడిపిన టాప్ 7 హై ప్రొఫైల్ రాజకీయ నాయకులు వీరే.. లిస్ట్ ఓ లుక్ వేయండి!
ఇన్నర్ రింగ్ రోడ్ విషయంలో సిబిఐ పోలీసులు నిన్న నారా లోకేష్ కు నోటీసులు పంపించారు. ఐసీసీ సెక్షన్ 120(బీ), 409, 420, 34, 35, 36, 37, 166, 167, 217 సెక్షన్ల కింద నారాలోకేష్ కు నోటీసులు పంపారు. వీటితో పాటు.. అవినీతి నిరోధక చట్టం లోని సెక్షన్ 13(2), 13(1)(సీ), 13(1)(డీ) కింద కూడా కేసులు నమోదు చేసారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజధాని అమరావతిలో 97KM మేర ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మించడానికి కంకణం కట్టుకున్నారు. అయితే.. రూట్ మ్యాప్ రూపకల్పన పూర్తయ్యాక 2015 జూలై 22న ఇంకా 2017 ఏప్రిల్ 4న రెండవ సారి, 2018 అక్టోబరు 31 మూడవ సారి ఈ అలైన్మెంట్ లో మార్పులు చేసారు. క్విడ్ ప్రోకోలో భాగంగా ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన వారి భూమి రేట్లు పెరగడం కోసమే ఈ మార్పులు చేసారని సిబిఐ భావిస్తోంది.
Advertisement
ఇవి కూడా చదవండి: నారా బ్రాహ్మణిపై ఎమ్మెల్యే రోజా ఎందుకు ఇంతలా ఫైర్ అవుతున్నారు? అసలు కారణం ఏంటంటే?
ఈ మార్పులు చేసిన అలైన్మెంట్ కి దగ్గరలోనే లింగమనేని 355 ఎకరాలు, హెరిటేజ్ కు పదమూడు ఎకరాల భూమి ఉంది. నారాలోకేష్ కు కూడా హెరిటేజ్ లో పదిశాతం వాటా ఉంది. వీటి ధర పెరగడం కోసమే ఈ అలైన్మెంట్ మార్చారని సిబిఐ ఆరోపణ చేస్తోంది. ఈ అలైన్మెంట్ మార్చాక లింగమేనని భూముల ధర రూ.177 కోట్ల నుంచి రూ.877 కోట్ల రూపాయలకు పెరిగిందని సిబిఐ పేర్కొంది. రాజధాని నిర్మాణం పూర్తయ్యే సరికి వీటి ధర రూ.2,130 కోట్లకు చేరుతుంది. ఈ అలైన్మెంట్ మార్పులో నారాయణ, చంద్రబాబుతో పాటు లోకేష్ జోక్యం కూడా ఉందని అంటున్నారు. ఈ మార్పుతో లబ్ది పొందిన లింగమనేని చంద్రబాబుకు కరకట్ట ఇంటిని ఇచ్చారని ఏపిసిఐడి చెబుతోంది. ప్రస్తుతం సీబీఎన్ కుటుంబం ఆ ఇంట్లోనే ఉంటోంది. దీని విషయమై లింగమేని ప్రభుత్వంతో ఎలాంటి ట్రాన్సక్షన్స్ జరపకపోవడంపై కూడా అనేక అనుమానాలు ఉన్నాయని సిబిఐ పేర్కొంది. లింగమనేని భూముల ధరలు పెరగడం, హెరిటేజ్ కు లాభాలు రావడం, కరకట్ట ఇంటిని పొందడంలో కూడా లోకేష్ చక్రం తిప్పారు అంటూ సిబిఐ ఆరోపణ చేస్తోంది.
మరిన్ని..
జైలు జీవితం గడిపిన టాప్ 7 హై ప్రొఫైల్ రాజకీయ నాయకులు వీరే.. లిస్ట్ ఓ లుక్ వేయండి!
అమ్మాయిలు ఇది గుర్తుంచుకోండి.. మీ ప్రియుడు ఈ 5 పనులు చేస్తుంటే.. మీరంటే చాలా ప్రేమ అని అర్ధమట!