Advertisement
జూనియర్ ఆర్టిస్ట్ ఆ*త్మ*హ*త్యకు ప్రేరేపించారనే ఆరోపణలపై ‘పుష్ప’ నటుడు జగదీష్‌ను అరెస్టు చేశారు. తన సహనటుడి ఫోటోలు తీసి బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. అల్లు అర్జున్ ‘పుష్ప: ది రైజ్’ సినిమాలో సహాయ నటుడి పాత్ర పోషించిన జగదీష్ ప్రతాప్ బండారిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జూనియర్ ఆర్టిస్టు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించినందుకు పంజాగుట్ట పోలీసులు బుధవారం అరెస్ట్ చేసారు.
Advertisement
పంజాగుట్ట ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ మహిళ (జూనియర్ ఆర్టిస్ట్) నవంబర్ 29న ఆ*త్మ*హ*త్య చేసుకోవడానికి ప్రయత్నించింది. విచారణలో జగదీష్ వేధింపుల వల్లే ఆమె చనిపోయిందని పోలీసులు గుర్తించారు. నవంబర్ 27న మహిళ జగదీష్‌తో ఉన్నప్పుడు ఆమెకు తెలియకుండా ఫొటోలు తీశాడు. ఆ తర్వాత వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు.
Advertisement
వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ మహిళ ఇటువంటి పని చేయడానికి సిద్ధపడింది. ఆ మహిళను వేధించినందుకు.. ఆమెను ఆ**త్య దిశగా ప్రేరేపించారనే అభియోగం కింద పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న జగదీష్‌ను బుధవారం అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. జగదీష్ ప్రతాప్ బండారి 2019లో విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం ‘మల్లేశం’తో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. అల్లు అర్జున్ ‘పుష్ప: ది రైజ్’లో కేశవ పాత్ర అతనికి కీర్తిని తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ‘పుష్ప: ది రూల్’ షూటింగ్లో ఉన్నాడు. ఇవి కాకుండా కేశవ ‘చివరకు మిగిలేది’ మరియు ‘పిక్‌పాకెట్ 2: ది మర్డర్ ప్లాన్’ సినిమాల్లో కూడా నటిస్తున్నారు.
Read More:
సలార్ రివ్యూ లీక్ ! సినిమాపై ఎలాంటి టాక్ వచ్చిందో తెలుసా ?
వైస్సార్ ని ఎందుకు గొప్ప లీడర్ అంటారు ? ఈ ఒక్కసంఘటన సరిపోదా ! సలాం కొట్టాల్సిందే !
26 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధించిన యశస్వినీ రెడ్డి ఎవరో తెలుసా ? బ్యాక్ గ్రౌండ్ ఇదే !