Advertisement
chatrapathi shekar: పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులలో చిన్న పిల్లవాడికి సైతం ఆ పేరు తెలిసిపోయింది. ఆయనకి అంత క్రేజ్ ఉంది కాబట్టి ఆయన సినిమాలలో నటించే ఆర్టిస్టులు చాలా అదృష్టవంతులు అనే చెప్పాలి. ఆయన మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ అయినా సరే అది మాత్రం మంచి గుర్తింపు వచ్చే విధంగా ఆయన దాన్ని చిత్రీకరించే విధానం హైలైట్ గా నిలుస్తుంది. అలాంటి ఆయన చేసిన శాంతినివాసం సీరియల్ నుంచి మొన్న చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా వరకు కొంతమంది నటులు రెగ్యులర్ గా ఆయన సినిమాలలో కనిపిస్తూ ఉంటారు.
Read also: బిర్యానీకి ఆ పేరు ఎలా వచ్చింది.! HYD బిర్యానీని పరిచయం చేసింది ఎవరు ?
అందులో ఒకరు నటుడు శేఖర్. ఈయన రాజమౌళి తీసిన శాంతినివాసం సీరియల్ నుంచి ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా వరకు (బాహుబలి సిరీస్ మినహా) అన్ని సినిమాలలో మనకు కనిపిస్తారు. చత్రపతి సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ రోల్ లో నటించిన శేఖర్ కి ఆ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. దీంతో ఆయన పేరు కూడా చత్రపతి శేఖర్ గా మారిపోయింది. ఈ చిత్రంలో ఆయన చేసిన భద్రం పాత్ర చాలా పాపులర్ అయిందనే చెప్పాలి.
Advertisement
అయితే మిగతా సినిమాల్లో అంతగా కనిపించని శేఖర్.. రాజమౌళి సినిమాల్లో మాత్రం తప్పనిసరి. అసలు శేఖర్ కు రాజమౌళి తో ఎలా పరిచయం ఏర్పడింది? జక్కన్న తన ప్రతి సినిమాలో శేఖర్ కి ఎందుకు చాన్స్ ఇస్తాడు? అన్న సంగతి చాలా మందికి తెలియదు. నిజానికి శేఖర్ మొదట రాజమౌళి దర్శకత్వంలో శాంతి నివాసం సీరియల్ లో నటించిన విషయం తెలిసిందే. ఆ సీరియల్ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో శేఖర్ టాలెంట్ గురించి తెలిసిన జక్కన్న అప్పటినుండి తన ప్రతి సినిమాలోను శేఖర్ కి ఆఫర్ ఇస్తున్నాడు. రాజమౌళి తన సినిమాలలో కనీసం ఒక చిన్న క్యారెక్టర్ అయినా ఆయన కోసం రాసుకుంటారు అంటే వీరిద్దరి మధ్య అంత ఫ్రెండ్షిప్ ఉందన్నమాట.
Advertisement
Read also: మైదాపిండి తో చేసిన వంటకాలు తినడం వలన కలిగే నష్టాల గురించి తెలుసా ?