Advertisement
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్ ని కేవలం ఒక ఆటగానే కాకుండా చాలా దేశాలు దీనిని వారి యొక్క గొప్పతనం చాటుకునే ఒక అవకాశంగా భావిస్తూ ఉంటాయి. క్రికెట్ పై ఈ మధ్యకాలంలో చాలా దేశాలు ఫోకస్ చేస్తున్నాయి. అయితే, ఈ క్రికెట్ యోయో టెస్ట్ అనేది చాలా కీలకమైంది. కానీ దీనికి గురించి ఎవరికీ తెలియదు. దానిపై ఇవాళ క్లారిటీగా తెలుసుకుందాం.
Advertisement
యోయో టెస్ట్ అంటే ఏమీ లేదు. ఆటగాళ్లు నిర్దిష్ట సమయంలో, నిర్దిష్ట దూరాన్ని రన్నింగ్ తో ఎంత వేగంగా, ఎన్ని రౌండ్లలో విజయవంతంగా పూర్తి చేస్తారు అన్నదాన్నే పరీక్షిస్తారు. అందుకుగాను పలు రౌండ్లు ఉంటాయి. రౌండ్ రౌండ్ కి మధ్య విరామం అస్సలు ఉండదు. అంటే ఒక రౌండులో సూచించిన దూరాన్ని, సూచించిన సమయంలోగా ఆటగాళ్లు రన్నింగ్ తో చేరుకోవాలి. సమయం పూర్తి కాగానే బీప్ సౌండ్ వస్తుంది. అప్పటికి ఆటగాడు ఇంకా దూరాన్ని చేరుకోకపోతే ఆ రౌండ్ లో విఫలమైనట్లు లెక్క. ఇక బీప్ ముగియగానే గ్యాప్ లేకుండా మరో రౌండ్ ప్రారంభమవుతుంది. అందులోనూ నిర్దిష్టమైన దూరాన్ని, సూచించిన సమయంలో గా రన్నింగ్ చేస్తూ చేరుకోవాలి. అప్పుడు కూడా సమయం మించగానే బీప్ వస్తుంది. అయితే అప్పటికి ఆ దూరాన్ని కూడా ఆటగాడు చేరకోకపోతే రెండో రౌండ్ లోను అతను విఫలమయ్యాడని భావిస్తారు. ఇక మూడో రౌండ్ లోను నిర్దిష్టమైన దూరాన్ని, సూచించిన సమయంలోగా చేరుకోకపోతే అప్పుడు మూడు రౌండ్లు ఫెయిల్ అయ్యాడు కాబట్టి అతను పూర్తిగా యోయో టెస్ట్ ఫెయిల్ అయినట్లు భావిస్తారు.
Advertisement
యోయో టెస్టును నిజానికి ఫుట్ బాల్ ప్లేయర్ల కోసం డాక్టర్ జెన్స్ బ్యాంగ్స్ బో అనే డానిష్ సైంటిస్టు కనిపెట్టాడు. 1990లలో యోయో టెస్ట్ ను ఫుడ్ బాల్ ప్లేయర్లకు నిర్వహిస్తున్నారు. యోయో టెస్టులో అన్ని రౌండ్లను విజయవంతంగా పూర్తి చేస్తే ఇచ్చే గరిష్ట స్కోరు 21. ఇది ఫుట్బాల్ ఆడే వారికి ఉంటుంది. అయితే భారత్ లో మాత్రం క్రికెటర్లకు యోయో టెస్ట్ తో పాస్ అయ్యేందుకు కావలసిన కనీస స్కోరు 16.1 మాత్రమే. కాగా న్యూజిలాండ్, ఇంగ్లాండ్ క్రికెట్ ప్లేయర్లకు యోయో టెస్ట్ కనీస స్కోర్ ను ఆయా దేశాల క్రికెట్ బోర్డులు 19 గా నిర్ణయించాయి. అలాగే మన దాయాది దేశాలైన పాకిస్తాన్, శ్రీలంకలలో ఈ స్కోరును 17.4 గా నిర్ణయించారు. సాధారణంగా యోయో టెస్ట్ అంటే ఫిట్నెస్ ఉన్న ప్లేయర్లకు మినిమం స్కోరు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు.
Read also: SAMANTHA : సమంత ఆస్తుల విలువ ఎంతంటే..?