Advertisement
పెళ్లి చేసేటప్పుడు అమ్మయికి అబ్బాయికి వయస్సు మధ్య గ్యాప్ అనేది ఎంత వరకు ఉండాలనే విషయాన్ని కనుక చర్చించినట్టయితే ఒక్కొక్కరూ ఒక్కోరకంగా చెబుతుంటారు. అమ్మాయి అసలు అబ్బాయి కంటే చిన్నదా ? పెద్దదా? వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉందనే విషయాలు కచ్చితంగా కనిపిస్తాయి. పెళ్లి చేసేటప్పుడు ఇద్దరూ తల్లిదండ్రులు ఆరా తీస్తుంటారు. పెళ్లి నిర్ణయించేటప్పుడే ఈ అంశాన్ని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటారు. భార్య, భర్తల మధ్య నిర్ణీత వయస్సు అంతరం ఉండటం చాలా ముఖ్యం అని పలు పరిశోధనలు పేర్కొంటున్నాయి. ఒకవేళ అలా జరుగకపోతే వీరి మధ్య మనస్పార్థాలు ఎక్కువ అవుతాయని.. జీవితాంతం అవి వెంటాడుతాయని పేర్కొంటుంటారు పెద్దలు. భార్య భర్తల మధ్య వయస్సు గ్యాప్ ఎంత ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
పురాతన కాలం సంప్రదాయం ప్రకారం.. అమ్మాయి వయస్సు కంటే అబ్బాయి వయస్సు ఎక్కువగా ఉండాలని చెబుతారు. ఇద్దరి మధ్య వయస్సు తేడా ఎంత ఉంటుందో ఎవ్వరూ చెప్పలేదు. అబ్బాయి-అమ్మాయి వయస్సు మధ్య తేడా ఎలా ఉండాలి. వాస్తవానికి 5 నుంచి సంవత్సరాల మధ్య వ్యత్యాసం ఉండటం బెటర్. ఈ విషయంపై చాలా పరిశోధనలు కూడా జరిగాయి. వివిధ వయస్సుల అబ్బాయిలు, అమ్మాయిల ఆలోచనలలో చాలా తేడా ఉంటుందని ఓ పరిశోధనలో తేలింది. ఈ వ్యక్తులు కూడా ఒకరినొకరూ చాలా శ్రద్ధ వహిస్తారు. ఒకరి విషయాలను మరొకరూ ఎలా చూసుకోవాలని వారికి బాగా తెలుస్తుంది. దంపతుల మధ్య ఒకటి , రెండు సంవత్సరాలు తేడా ఉంటే వారి మధ్య విడాకులు తీసుకునే అవకాశం 3 శాతం ఉంటుందని ఓ అధ్యయనం వెల్లడించింది. ఐదేళ్ల వయస్సు గ్యాప్ ఉంటే విడాకులు తీసుకునే అవకాశం 18, పదేళ్ల గ్యాప్ ఉంటే 39 శాతం, 20 ఏళ్ల వయస్సు గ్యాప్ ఉంటే 95 శాతం ఉంటుందని పేర్కొంది.
Advertisement
వాస్తవానికి భార్య, భర్తల మధ్య వయస్సు ఎంత తక్కువగా ఉంటే..అంత సమన్వయం బాగుంటుందని మరో అధ్యయనంలో వెల్లడి అయింది. ఇద్దరి మధ్య సమన్వయం కూడా అంతే మంచిగా ఉంటుందని.. వీరి మధ్య విడాకుల అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని పేర్కొంది. శాస్త్రీయ దృక్కోణంలో చూస్తే.. భార్య భర్తల మధ్య సంబంధంలో భర్త వయస్సు ఎక్కువగా ఉండటం చాలా అవసరం. అబ్బాయి పరిపక్వత పొందుతాడు. అప్పుడే అతను అమ్మాయికి సంబంధించిన అన్ని బాధ్యతలను అర్థం చేసుకోగలడని అధ్యయనం పేర్కొంది. మొత్తానికి ఏ రకంగా చూసినా మానసికంగా, శారీరకంగా ఇలా రకరకాలుగా పరిశీలించినట్టయితే.. అబ్బాయికి అమ్మాయికి మధ్య మూడు నుంచి ఐదేళ్ల వరకు తేడా ఉంటే బెటర్ అని స్పష్టమవుతోంది.
మరికొన్ని ముఖ్య వార్తలు :
భార్య కోసం ఖండాలు దాటిన భర్త.. సైకిల్ పైనే స్వీడన్ కు..!