Advertisement
ఆంధ్ర ప్రదేశ్ స్కిల్ డెవెలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ నెలలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే ఆయన అరెస్ట్ అయ్యి దాదాపు నెల రోజులు కావొస్తోంది. అయితే.. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడుకు బెయిల్ రాలేదు. నాన్ బెయిలబుల్ వారంట్ పై ఆయన అరెస్ట్ అవడంతో టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి. ఆయనపై మరిన్ని కేసులు ఉండే అవకాశం ఉండడంతో.. ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్స్ కూడా రద్దు అయ్యాయి. దీనితో టీడీపీ వర్గాల్లో ఆందోళన నెలకొంటోంది.
Advertisement
వీటిని కూడా చదవండి: ఈ ఏడాది అక్టోబర్ నవంబర్ లలో ఏమి జరగబోతోంది? అభిగ్య ఆనంద్ ఏమి చెబుతున్నారంటే?
వీటిని కూడా చదవండి:Jailer Movie: జైలర్ మూవీ లో “వర్మ” గ్రూప్ లో ఉన్న ఈ డాన్సర్ ఎవరో తెలుసా?
Advertisement
ప్రస్తుతం ఎపి స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. ఒకవేళ ఈ కేసులో విచారణ పూర్తి అయ్యి బెయిల్ పై బయటకు వచ్చినా.. చంద్రబాబు నాయుడుకు మరో మూడు కేసులు చుట్టుకోనున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో అనేక అవకతవకలలు చేయడమే కాకుండా అనేక డొల్ల కంపెనీలను తీసుకొచ్చి కుంభకోణానికి పాల్పడ్డారు అంటూ చంద్రబాబు నాయుడు పై ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై సిబిఐ ఇప్పటికే ఆయనపై కేస్ నమోదు చేసారు.
ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పులో కూడా చంద్రబాబు హస్తం ఉందని ఆయనపై అభియోగం ఉంది. ఇది కాకుండా.. ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలో కూడా కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు అంటూ ఆయనపై కేసు నమోదు అయ్యింది. ఒకవేళ స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో చంద్రబాబు నాయుడు బెయిల్ పై బయటకి వచ్చినా.. ఈ మూడు కేసుల్లో ఎదో ఒక దానిపై తిరిగి అరెస్ట్ అవ్వనున్నారు. ఇప్పటికే ఆయన ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం ఎపి హై కోర్ట్ కు అప్లై చేసుకోగా.. హై కోర్ట్ వాటిని డిస్మిస్ చేసింది. దీనితో.. ఆయన ఉన్నత న్యాయస్థానానికి వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు.
మరిన్ని..