Advertisement
చిరంజీవి తమ్ముడుగా పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోకి వచ్చారు. తనదైన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఆయన చేసిన సినిమాలు వరుసగా సూపర్ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా మంచి స్టార్ డమ్ ని సంపాదించుకున్నారు. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నారు. జనసేన పార్టీ ని పెట్టి రాజకీయంగా కూడా ఎదుగుతూ ప్రజలకు సేవ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీకి కనుక రాకపోయి ఉంటే సన్యాసం తీసుకుని హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉండేవాడిని అని పవన్ కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
Advertisement
ఒకవేళ సన్యాసుల్లో కలవకపోతే కొంత భూమిని తీసుకుని వ్యవసాయం చేసుకునే వాడినని ఓ సందర్భంలో ఆయన చెప్పడం విశేషం. మొత్తానికి పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో చిరంజీవిని మించి స్టార్డం సంపాదించుకున్నారు అని చెప్పడంలో సందేహమే లేదు. జనాల్లో కూడా ఆయన మీద విపరీతమైన నమ్మకం ఉంది.
Advertisement
Also read:
అందుకే డిప్యూటీ సీఎం గా ఎదిగేంత వరకు వాళ్లు అతని వెనుక ఉండి ఆయనకు తీవ్రంగా సపోర్ట్ చేశారు. మొత్తానికి ఆయన తనను తాను మరొకసారి గొప్ప లీడర్ గా ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే ఏపీలో ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకుని న్యాయం కల్పించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన చాలా సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!