Advertisement
వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను తీసుకు వస్తోంది. వాట్సాప్ లో అనేక ఫీచర్లు ఇప్పటికే వచ్చాయి. ప్రస్తుతం వాట్సాప్ మన నిత్యజీవితంలో భాగమైపోయింది. సులువుగా త్వరగా మెసేజ్లు పంపించడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజ్ యాప్ లలో వాట్సాప్ మొదటి స్థానంలో ఉంది. వాట్సాప్ తీసుకొచ్చిన లేటెస్ట్ అప్డేట్ కి సంబంధించిన వివరాలను చూస్తే.. వాట్సాప్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ మరింత ఈజీ చేస్తోంది. ఈ ఫీచర్ తో మనకు వచ్చే వాయిస్ మెసేజ్లను టెక్స్ట్ రూపంలో మార్చుకోవచ్చు.
Advertisement
Advertisement
ఆడియో మెసేజ్ వినలేని సందర్భాల్లో అవతలి వ్యక్తి పంపించిన వాయిస్ మెసేజ్ ని టెక్స్ట్ రూపంలో రాసుకోవాల్సిన సందర్భంలో బాగా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా ప్రయాణంలో ఉన్నప్పుడు వాయిస్ మెసేజ్లని అర్థం చేసుకోవడం లేదంటే అందరి ముందు వినడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటప్పుడు మీరు దానిని అక్షరాల రూపంలో మార్చుకోవచ్చు. ఈ ఫీచర్ ఆక్టివేట్ చేయడానికి మొదట వాట్సాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి చాట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి అక్కడ అందుబాటులో ఉండే ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ లేదా ఆన్ అనే ఆప్షన్స్ చూడొచ్చు.
ఒకసారి యాక్టివేట్ చేసుకున్నాక వాయిస్ నోట్స్ ని టెక్స్ట్ రూపంలో మార్చుకోవడానికి దాని కింద ఒక ఆప్షన్ కనబడుతుంది. ఆ ఆప్షన్ ని ఎనేబుల్ చేసిన తర్వాత అందుకున్న వాయిస్ మెసేజ్ టెక్స్ట్ రూపంలోకి వస్తుంది. ఇలా సింపుల్ గా మీరు వాయిస్ మెసేజ్లును టెక్స్ట్ రూపంలోకి మార్చుకోవచ్చు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!