• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Featured » కృష్ణంరాజుకు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయంటే.. వాటి విలువ తెలిస్తే షాకవుతారు..!!

కృష్ణంరాజుకు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయంటే.. వాటి విలువ తెలిస్తే షాకవుతారు..!!

Published on September 12, 2022 by mohan babu

Advertisement

టాలీవుడ్ ఇండస్ట్రీలో తన ప్రస్థానం ఎంతో గొప్పది. తను ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటినుంచి ఇప్పటివరకు ఎలాంటి చిన్న అభియోగం కూడా లేని రెబల్ స్టార్ గా తెలుగు అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు కృష్ణంరాజు. అంతటి పేరు ఉన్న మహారాజు అనారోగ్య కారణాల వల్ల ప్రాణాలు విడిచారు.. రాజుల వంశానికి చెందిన కృష్ణంరాజు మొదటినుంచి ధనవంతుడు.. 1966లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 185 చిత్రాలకుపైగా నటించారు. రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో ప్రజల్లో మమేకమై ఎంపీగా పలుమార్లు గెలిచి కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. కృష్ణంరాజుకు ముగ్గురు కూతుర్లు. మరి వీరికి సంపన్న కుటుంబం కాబట్టి కృష్ణంరాజుకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం.. 2009లో ఎంపీ ఎన్నికల్లో రాజమండ్రి నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన కృష్ణంరాజు ఎన్నికల అఫిడవిట్ లో భాగంగా ఆయన ఆస్తులు ఇతర వివరాలను తెలియజేశారు..

Advertisement

also read: ఒక దేశంలో పుట్టి మరో దేశానికి ఆడుతున్న టాప్ 10 క్రికెటర్స్..!

Advertisement

2009 వరకు కుటుంబ ఆస్తుల విలువ 8.62 కోట్లు,2.14 కోట్ల అప్పులు ఉన్నాయి. అలాగే కృష్ణంరాజు వద్ద 5.28 లక్షల విలువైన బ్యాంకు డిపాజిట్లు, ఆయన పేరిట ఉన్న బాండ్లు 20 లక్షలు ఉన్నాయని సమాచారం. అలాగే కృష్ణంరాజు పేరిట 8 లక్షల విలువైన కారు, ఆరు లక్షల విలువైన మరో షిఫ్టు కారు, నా భార్య పేరు మీద వెర్నా, హుండాయ్,ఐ టెన్ కార్లు కూడా ఉన్నాయని కృష్ణంరాజు పేర్కొన్నారు. ఇక బంగారం విషయానికి వస్తే ఆయన వద్ద 754 గ్రాముల బంగారం, భార్య వద్ద 1690 గ్రాముల బంగారం, ఇక వారు ముగ్గురు పిల్లల వద్ద 600, 549, 570 గ్రాముల చొప్పున బంగారం ఉందని, 2009 లెక్కల ప్రకారం ఈ బంగారం విలువ 1.8 కోట్ల పైమాటే. ఇక స్థిరాస్తుల విషయంలో వస్తే కృష్ణంరాజుకు మొగల్తూరులో 9.50 ఎకరాలు,1.2, రామన్నపాలెంలో 5 సెంట్ల వ్యవసాయేతర భూమి, అల్లాపూర్ లో 860 చదరపు గజాల స్థలం ఉందని పేర్కొన్నాడు. అప్పటి ప్రభుత్వ లెక్కల ప్రకారం వీటి విలువ మొత్తం 45 లక్షలు ఉంటుంది. అలాగే కృష్ణంరాజు పేరిట మొగల్తూరులో గాంధీ విగ్రహం సర్కిల్లో షాపింగ్ కాంప్లెక్స్, ఆరు సెంట్ల భూమి, ఒక ఇల్లు కూడా ఉన్నాయి.

ప్రభుత్వ లెక్కల ప్రకారం వీటి విలువ 42 లక్షలుగా ఉంటుందట. ఈ విధంగా కృష్ణంరాజు పేరిట 1.08 కోట్ల ఆస్తులు ఉన్నాయి.అలాగే కృష్ణంరాజు భార్య పేరిట గోదావరి జిల్లా టంగుటూరు మండలం చేబ్రోలులో 1.81,0.34,1.61,0.56 ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ భూమి, రామన్నపాలెం లో 1.5,0.30,0.30 ఎకరాల పొలం ఉంది. అలాగే 5 ఎకరాల్లో మామిడి తోట, విజయవాడ సమీపం గన్నవరంలో 0.70 సెంట్ల భూమి, హైదరాబాద్ కూకట్పల్లి అల్లాపూర్ లో 823 గజాలు, 500 గజాల స్థలం ఉంది. జూబ్లీహిల్స్ లో 491.5గజాల విస్తీర్ణంలో నిర్మించిన ఇల్లు, చెన్నైలోని సైదాపేట లో 3840చదరపు అడుగుల విస్తీర్ణంలో కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం వీటి విలువ ఏడు కోట్ల పై మాటే. అలాగే కృష్ణం రాజు కూతురు పేరు మీద శంషాబాద్లో 200 గజాల స్థలం కూడా ఉంది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం కృష్ణంరాజు కుటుంబం పేరిట మొత్తం 300 కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

also read:అత్యధిక ప్రాఫిట్ అందించిన టాప్ మీడియం బడ్జెట్ మూవీస్ ఇవే

Related posts:

కృష్ణంరాజుకు “రెబల్ స్టార్” బిరుదు ఎలా వచ్చిందంటే..? ప్రభాస్ ది ఎంత గొప్ప మనసు.. అభిమానుల విందు కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో తెలుసా..? పవన్, ప్రభాస్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా.. బాక్సాఫీస్ షేకవ్వాల్సిందే..!! వయసులో వారి కంటే పెద్దవారిని పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు.. ఎవరంటే..?

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd