Advertisement
నేటి కాలంలో నిత్యవసర ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందులో మనకు ఎక్కువగా ఉపయోగపడేది పెట్రోల్. పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగినందువల్ల మనం ఏ పెట్రోల్ కంపెనీ ఎంత మైలేజ్ ఇస్తుందో ఆలోచించి పెట్రోల్ పోయించుకోవాలి. అందుకోసం సర్వే ప్రకారం ఏ పెట్రోల్ కంపెనీ ఎంత మైలేజ్ ఇస్తుంది అనేది పరీక్షించారు. ఏ పెట్రోల్ కంపెనీ ఎక్కువ మైలేజ్ ఇస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
ముందుగా భారత్, ఇండియన్, హెచ్ పి, నయారా, షెల్ ఐదు రకాల కంపెనీ పెట్రోల్ ను ఓ వ్యక్తి తీసుకున్నారు. దీనిని పరీక్షించేందుకు పల్సర్ 150 బైక్ ను ఉపయోగించారు ఆ వ్యక్తి. ఇందులో కేవలం 100ml పెట్రోల్ పోసి ఎంత మైలేజ్ ఇస్తుంది అని పరీక్షించారు. ముందుగా భారత్ పెట్రోల్ నీ పోసి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అని చూశారు భారత్ పెట్రోల్ కేవలం 6.1km వచ్చింది.
Advertisement
తర్వాత షెల్ పెట్రోల్ ని పోసి చూడగా 5.0km మైలేజ్ ఇచ్చింది. ఆ తర్వాత హెచ్ పి నీ పోసి చూడగా 5.5km మైలేజ్ ఇచ్చింది. ఇక ఇండియన్ ఆయిల్ ని పోసి చూడగా 4.6km మైలేజ్ ఇచ్చింది. ఇక చివరగా నయారా పెట్రోల్ కేవలం 3.0km మాత్రమే మైలేజ్ ఇచ్చింది. దీని ప్రకారం ఎక్కువ మైలేజ్ ఇచ్చే కంపెనీ భారత్ పెట్రోల్ అని తెలిసింది. కాబట్టి ఇక నుంచి ఎవరైనా పెట్రోల్ పోయించుకనే టప్పుడు.. ఈ సూచనలు పాటించండి.
READ ALSO : వరస ప్లాపుల తర్వాత హిట్స్ తో కమ్ బ్యాక్ ఇచ్చిన హీరోలు వీళ్లే !