Advertisement
వాస్తు ప్రకారం ఫాలో అవ్వడం వలన చాలా సమస్యల నుంచి బయటపడొచ్చు. వాస్తు ప్రకారం చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు. ఏ రంగు వాలెట్ ని ఉపయోగిస్తే మంచిది..? ఏ రంగు వాలెట్ ని ఉపయోగించడం వలన ఎక్కువ డబ్బులు నిలుస్తాయి అనే వాటి గురించి ఇప్పుడు చూద్దాం. వాలెట్ రంగు కేవలం ఫ్యాషన్ అనే కాదు. ఆర్థిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుందట. చాలామంది నీలం రంగు వాలెట్ ని ఉపయోగిస్తారు. నీలం రంగు వాలెట్ ప్రశాంతత, విశ్వాసానికి చిహ్నం.
Advertisement
ఈ రంగు వాలెట్ ని ఉపయోగిస్తే ఆర్థిక ఇబ్బందులకు దూరంగా ఉండొచ్చు. పైగా ఫైనాన్షియల్ ప్లాన్స్ బాగా వర్క్ అవుట్ అవుతాయి. బాగా డబ్బుల్ని ఆదా చేసుకోవచ్చు. అదే గోధుమ రంగు వాలెట్ ఉపయోగించినట్లయితే ఖర్చులు అదుపులో ఉంటాయి. పొదుపు బాగా పెరుగుతుంది. కాబట్టి గోధుమరంగు వాలెట్ ని కూడా ఉపయోగించవచ్చు. ఆకుపచ్చ రంగు వాలెట్ ఉపయోగించినట్లయితే ఉద్యోగ ఆర్థిక అభివృద్ధికి ఇది సహాయం చేస్తుంది. మీ అభివృద్ధికి తోడ్పడుతుంది.
Advertisement
నలుపు రంగు వాలెట్ అనవసరమైన ఖర్చుల్ని నివారిస్తుంది. డబ్బు స్థిరంగా ఉండేటట్టు నలుపు రంగు వాలెట్ చూస్తుంది. ఎరుపు రంగు వాలెట్ సంపదకు చిహ్నం. ఈ రంగు వాలెట్ ని కనుక ఉపయోగించినట్లయితే డబ్బులు ఎక్కువ ఆదా చేసుకోవచ్చు. ఆర్థికంగా ఇబ్బందుల్ని ఎదుర్కొనక్కర్లేదు. లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కూడా. కాబట్టి ఇలా ఈ రంగుల్ని బట్టి మనం ఆర్థిక పరిస్థితి గురించి చెప్పొచ్చు. అలాగే లక్ష్మీదేవికి అనవసరమైన ఖర్చులు చేసే వారంటే ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి నిలవదు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి