Advertisement
మనుషులు బిజీ అవుతున్నా కొద్దీ సైన్స్ కూడా నిరంతరం పురోగమిస్తుంది. మనుషులు చేయాల్సిన ఎన్నో పనులను మెషిన్లు చేసి పెడుతున్నాయి. నేడు మన ఇళ్లలో బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషిన్లు వచ్చాయి. దీంతో మనం పాతకాలంలో లాగా కష్టపడాల్సిన అవసరం లేదు. అయితే కొత్తగా వాషింగ్ మెషిన్ కొనాలనుకునే వారికి ఏం మిషన్ కొనాలో తెలియడం లేదా? ఈ జాబితాలో మీరు టాప్ లోడింగ్, ఫ్రంట్ లోడింగ్, ఫుల్లి ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్, వాషింగ్ మిషన్ల వివరాలు చూడవచ్చు. వాషింగ్ మెషిన్ అనేది ప్రతి భారతీయ కుటుంబానికి ఒక దీర్ఘకాలిక పెట్టుబడి వంటిది. అందుకే ఇది ఏళ్లుగా ఎన్నో మార్పులను చేస్తుంది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా వాషింగ్ మెషిన్లు చాలా ఫ్యాన్సీ రూపు సంతరించుకున్నాయి.
Advertisement
Read also: “నాని” నుంచి “వరుణ్ తేజ్” తెలంగాణ యాస లో అద్దరగొట్టిన తెలుగు హీరోస్ వీరేనా ?
అయితే ఇందులో ఏది బెస్ట్ అనే దాని మీద చాలామందికి అవగాహన లేదు. వాషింగ్ మెషిన్ వాడే విషయంలో, కొనే విషయంలో కాస్త అవగాహన అవసరం అనే చెప్పాలి. అసలు ఏ రకం వాషింగ్ మిషన్ మంచిదో ఒకసారి చూద్దాం. ఈ టాప్ లోడ్ మిషన్లలో ఒక బట్ట మరొక బట్టతో రుద్దుకోవడం లేదా రాపిడి ద్వారా బట్టలు వాష్ అవుతూ ఉంటాయి. అలాగే బట్టల చుట్టూ ఎప్పుడూ నీళ్లు ఉంటాయి. అలా నీరు ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సర్ఫ్ కూడా ఎక్కువే తీసుకునే అవకాశం ఉంటుంది. ఫ్రంట్ లోడ్ మెషిన్లలో మాత్రం ఆ విధంగా ఉండదు. వీటిలో రెండు డ్రమ్ లు ఇస్తారు. ఇందులో కదిలే లోపలి డ్రమ్, నీరు ఉండి కదలని మరో డ్రమ్ ఉంటాయి. ఇవి బట్టలను నీళ్లలోకి లాగి వాటిని పైకి తిప్పుతూ నడుస్తుంది.
Advertisement
లోపలి డ్రమ్ములో ఉన్న తెడ్డులు బట్టలకు రివర్స్ మార్గంలో తిరగడంతో బట్టలు క్లీన్ అవుతాయి. అయితే ఈ మిషన్ తక్కువ నీరు, తక్కువ డిటర్జెంట్ ని తీసుకుంటుంది. దీనివల్ల బట్టలు కూడా ఎక్కువగా పాడయ్యే అవకాశం ఉండదు. ఇక మీరు అద్భుతమైన వాషింగ్, డ్రైయింగ్ కోరుకున్నట్లయితే ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ కి మించినది మరొకటి ఉండదు. ఈ మెషిన్ మీ దుస్తుల నుంచి వచ్చే పోగులు, ఉన్ని, ఇతర పదార్థాలను సేకరించి మీ దోస్తులు పరిశుభ్రంగా ఉంచడంతోపాటు మీరు డ్రైనేజ్ నిండిపోకుండా చేస్తోంది. 680 rpm రొటేషన్ వేగంతో తిరిగే ఈ మెషిన్ నిమిషాలలోనే శుభ్రమైన, పొడి దుస్తులు పొందవచ్చు. ఇక అలాగే బట్టల మన్నిక, మురికిని వదిలించే విషయం, వాటిని ఉతికే విధానం చూసుకుంటే.. ఫ్రంట్ లోడ్ మెషిన్ లే.. టాప్ లోడ్ మెషిన్ల కంటే చాలా బెస్ట్ అని చెప్పవచ్చు.
Read also: ANASUYA BHARADWAJ: “రంగస్థలం” లో రంగమ్మత్త క్యారెక్టర్ ని మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరంటే ?