Advertisement
సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. సాధారణంగా ఇండస్ట్రీలో హీరోయిన్లకు లైఫ్ టైం చాలా తక్కువ ఉంటుంది అని చెబుతూ ఉంటారు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న విధంగా హీరోయిన్లు వ్యవహరిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది హీరోయిన్లు ఒకే హీరోకి ఆయన పక్కన హీరోయిన్ గా, తల్లిగా, చెల్లిగా కూడా చేసిన సందర్భాలు లేకపోలేదు. ఇలా తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి సరసన మొదటగా హీరోయిన్ గా.. ఆ తర్వాత చెల్లిగా, ఇక మరికొన్ని రోజులకు తల్లిగా నటించిన హీరోయిన్స్ గురించి చాలా తక్కువ మంది ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. మరి ఆ హీరోయిన్స్ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Read also: సరిగ్గా 100 ఏళ్ల క్రిందట అల్లూరి పై బ్రిటిషర్లు ఇచ్చిన ఈ ప్రకటన చూసారా ? వాళ్ళని ఇలా బయపెట్టాడా ?
Advertisement
కే బాలచందర్ దర్శకత్వంలో 1979లో వచ్చిన చిత్రం ‘ఇది కథ కాదు’. ఈ చిత్రంలో చిరంజీవి – జయసుధ భార్యాభర్తలుగా నటించారు. ఆ తర్వత విజయ బాపినీడు దర్శకత్వంలో రవీంద్రనాథ్ చౌదరి నిర్మాతగా 1986లో వచ్చిన మగధీరుడు చిత్రంలో జయసుధ, చిరంజీవి కలిసి హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో 1995లో వచ్చిన రిక్షావోడు చిత్రంలో చిరంజీవికి తల్లి పాత్రలో నటించారు జయసుధ. అలాగే 1975లో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి హవా నడిపింది సుజాత. 1920లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ప్రేమ తరంగాలు అనే సినిమాతో చిరుతో జోడి కట్టి రొమాన్స్ చేసింది. కట్ చేస్తే.. 1982లో చిరంజీవి హీరోగా వచ్చిన సీతాదేవి సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో నటించి అందరిని ఆశ్చర్యపరిచింది సుజాత.
ఆ తర్వాత 1990వ సంవత్సరంలో హీరోయిన్ తల్లి పాత్ర కూడా చేసింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ‘బిగ్ బాస్’ సినిమాలో చిరంజీవికి తల్లిగా నటించింది సుజాత. ఇలా వీరిద్దరూ ఒకే హీరోతో హీరోయిన్ గా, చెల్లిగా, తల్లిగా నటించి అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఇందులో విచిత్రం ఏంటంటే 1980లో వచ్చిన ప్రేమ తరంగాలు చిత్రంలో చిరంజీవి, జయసుధ, సుజాత నటించారు. అంతేకాదు సుజాత, జయసుధ.. చిరంజీవికి తల్లి పాత్రలో నటించిన రెండు చిత్రాలు (రిక్షావోడు, బిగ్ బాస్) ఒకే సంవత్సరంలో విడుదల కావడం మరో విశేషం.
Read also: స్టార్ హీరోల కొంప ముంచిన మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్ తో చాటింగ్ లో నిజాలు వెలుగులోకి..!