Advertisement
ఇటీవల వచ్చిన మన భారతీయ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నాయి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎన్నో అవార్డులు సంపాదించడమే కాకుండా ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును కూడా దక్కించుకుంది. ఈ తరుణంలో హీరో ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది.
Advertisement
అమెరికాలో ఎన్టీఆర్ ఓ ఆంగ్ల మీడియాలో ముచ్చటించగా ఆయన ఆంగ్లంలో మాట్లాడే ఉచ్చారణ (బాష యాస) చాలా తప్పుగా ఉన్నదని తీవ్రమైన విమర్శలతో చురకలంటించారు. ఇలా ఎన్టీఆర్ మాదిరిగా ఆంగ్లంలో మాట్లాడి విమర్శలకు గురైన స్టార్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
రామ్ చరణ్:
ఆస్కార్ మరియు గోల్డెన్ గ్లోబ్స్ రెడ్ కార్పెట్ మీద ఉన్నప్పుడు, రామ్ చరణ్ విదేశీ పత్రికా సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడిన ఇంగ్లీష్ యాసను నకిలీ చేశారనే ఆరోపణతో అతడిని కొందరు ట్రోల్ చేశారు.
సమంత :
ప్రీమియర్ ఆఫ్ సిటాడెల్ కోసం సమంత లండన్ వెళ్లారు. లండన్‌లో షో చూసిన తర్వాత సమంత మీడియాతో ముచ్చటించారు. అయితే ఆ సమయం లో సమంత ఇంగ్లీష్ ఉచ్చరణపై అనేక ట్రోల్స్ వచ్చాయి. “ఈ భారతీయ నటులకు ఏమైంది? యుఎస్‌కి వెళ్లినప్పుడు, వేరే యాస ఎందుకు వస్తుంది అంటూ సమంతపై విమర్శలు చేశారు.
Advertisement
ఐశ్వర్యరాయ్ బచ్చన్:
ప్రపంచ మాజీ సుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్ కేన్స్ రెడ్ కార్పెట్ పై ప్రెస్‌తో సమావేశమైనప్పుడు ఐశ్వర్యారాయ్ ఆంగ్ల ఉచ్ఛరణ తప్పుగా ఉందని విమర్శలు వచ్చాయి.
కరీనాకపూర్:
రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్ కి హాజరైన కరీనా కపూర్ కూడా అమెరికన్ ఇంగ్లీష్ మాట్లాడడంలో ఫేక్ చేసింది అని ట్రోల్స్ చేశారు.
ప్రియాంక చోప్రా:
ప్రియాంక చోప్రా తన హాలీవుడ్ సినిమాలు మరియు టెలివిజన్ షోల కోసం అమెరికన్ యాసను తప్పుగా మాట్లాడుతుందంటూ తరచుగా ఆమె పై ట్రోల్స్ చేయబడింది.
అనిల్ కపూర్:
స్లామ్ డాగ్ మిలియనీర్ మూవీ విడుదల సమయంలో అనిల్ కపూర్ ఇంగ్లీష్ మాట్లాడే విధానంపై అనేక విమర్శలు వచ్చాయి.
Also read :
కృష్ణుడు పాత్రలో మెప్పించిన.. 16 మంది టాలీవుడ్ హీరోలు వీళ్ళే..!
ఎంతోమందిని ఉన్నత స్థాయికి తీసుకువచ్చిన నిర్మలమ్మ… చివరి క్షణాల్లో ఎలా మరణించారో తెలుసా..?
నరేష్ ను పవిత్ర లోకేష్ ప్రేమగా ఏమని పిలుస్తుందో తెలుసా?