Advertisement
సినీ ఇండస్ట్రీ అంటేనే ఎప్పుడు ఎవరికి ఎలాంటి హిట్ పడుతుందో మనం చెప్పలేం. ఏ సినిమాలో ఎంత ఉంది అనేది ప్రేక్షకులే నిర్ణయిస్తారు. సినిమా కథ బాగుంటే, నటన నచ్చితే సినిమా ఏ విధంగా రిలీజ్ అయినా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఎంతటి స్టార్ హీరో అయినా సరే కథా, నటన బాగాలేకుంటే సినిమా హిట్ అవడం చాలా కష్టం. ఇండస్ట్రీలో వరుస హిట్లు కొట్టి తర్వాత ఫ్లాపుల వల్ల దెబ్బతిని మళ్లీ కం బ్యాక్ అయినా మూవీస్ ఏంటో మరోసారి చూద్దాం..?
Advertisement
కమలహాసన్:
రీసెంట్ గా విక్రమ్ సినిమాతో లోక నాయకుడైన కమలహాసన్ గ్రాండ్ గా కం బ్యాక్ ఇచ్చారు. ఇది కమలహాసన్ సినీ చరిత్రలోనే పవర్ఫుల్ కం బ్యాక్ అని చెప్పవచ్చు. తమిళ్లో ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టిన విక్రమ్ లాంటి సినిమాలు మన తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలా ఉన్నాయి. దాదాపు అందరూ స్టార్స్ కి ఇలాంటి కం బ్యాక్ సినిమాలు ఉండడం విశేషం.
కృష్ణ :
1989లో కొడుకు దిద్దిన కాపురం తర్వాత కృష్ణ కెరీర్లో చెప్పుకోవడానికి పెద్ద హిట్లు లేవు. పచ్చని సంసారం హిట్టయినా, అది ఆయన రేంజ్ కి తగ్గది కాదు. దీని వల్ల కృష్ణ కు ఒరిగింది ఏమీ లేదు. 1994 లో నెంబర్ వన్ మూవీతో కృష్ణ మళ్లీ కం బ్యాక్ ఇచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి :
1992లో ఘరానా మొగుడు సినిమా ఇండస్ట్రీ హిట్. దీని తర్వాత చిరంజీవికి వరుస పరాజయాలు పలకరించాయి. ముఠామేస్త్రి, అల్లుడా మజాకా హిట్ అయినా అవి సాధారణంగా నిలిచాయి. కాంట్రవర్సీ లో మునిగిపోయి ఆ విజయాన్ని మరిచిపోయేలా చేశాయి. దీని తర్వాత ఏడాది గ్యాప్ తీసుకొని హిట్లర్ సినిమాతో మళ్లీ కం బ్యాక్ ఇచ్చారు చిరంజీవి. ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డు సంపాదించింది. దీంతో చిరంజీవి వెనుతిరిగి చూసుకోలేదు.
బాలకృష్ణ :
2001లో నరసింహనాయుడు వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత బాలకృష్ణ కు కూడా వరుస ఫ్లాప్ లు వచ్చాయి. చెన్నకేశవరెడ్డి,లక్ష్మీ నరసింహ మొదటి యాభై రోజుల వరకు ఎక్స్ లెంట్ గా ఆడిన, తర్వాత అవి నార్మల్ హిట్ గా నిలిచాయి. 2010 వరకు ఎలాంటి మూవీ చేసిన బాలయ్య కు పరాజయం ఎదురైంది. ఇక హీరోగా బాలకృష్ణ పైకి రావడం కష్టమని అనుకున్న తరుణంలో 2010లో సింహా మూవీ దెబ్బకు బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టింది. సీనియర్ హీరోల్లో ఫస్ట్ టైం 30 కోట్ల షేర్ వసూలు చేసిన మూవీగా నిలిచింది. ఈ సినిమాతోనే బాలయ్య మళ్లీ కం బ్యాక్ హిస్టరీ క్రియేట్ చేస్తున్నాడు.
Also Read: రాత్రిపూట మల్లెపూలు పెట్టుకునే స్త్రీలు ఇది తెలుసుకోవాల్సిందే..?
మోహన్ బాబు :
1990 లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మోహన్ బాబు, అసెంబ్లీ రౌడీ సినిమా స్టార్ హీరో గా మార్చింది. వరుస హిట్స్ తో అప్పటి స్టార్ హీరోలతో పోటీ పడ్డారు.మోహన్ బాబు మేజర్ చంద్రకాంత్ హిట్ తర్వాత వరుసగా ఎన్నో ఫ్లాపులు వచ్చాయి. ఇక హీరోగా మోహన్ బాబు అవుటయ్యారు విలన్ గా చేసుకోవడమే బెటర్ అన్న సమయంలో పెదరాయుడు రిలీజ్ అయింది. 1995 లో రిలీజ్ అయ్యింది.ఈ మూవీ ఎవరు అనుకోని విధంగా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. తెలుగు సినిమా చరిత్రలో అతి పెద్ద హిట్ గా నిలిచిన ఈ మూవీ మోహన్ బాబు కి ఎన్నో సంవత్సరాల కెరీర్ ను ఇచ్చింది.
కింగ్ నాగార్జున:
Advertisement
1996-1997 నాగార్జున కెరీర్లోనే బీభత్సమైన సమయం. అన్నమయ్య, నిన్నే పెళ్లాడతా వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత రక్షకుడు మూవీ నుంచి బ్యాడ్ టైం మొదలైంది.వరుసగా పరాజయాలు వచ్చాయి.ఆటోడ్రైవర్, చంద్ర లేఖ, ఆవిడ మా ఆవిడే ఇలా చాలా సినిమాలు పరాజయం అయ్యాయి. ఈ తరుణంలోనే నువ్వు వస్తావని సినిమా క్లాస్ పర్ఫామెన్స్ తో బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ తో మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చారు నాగార్జున.
విక్టరీ వెంకటేష్:
వెంకటేష్ కెరీర్లో దారుణంగా పడిపోవడం గానీ,అంతే స్ట్రాంగ్ గా పైకి లేవడం కానీ లేవు. ఉన్నవాటి లోనే ధర్మ చక్రం సినిమా మంచి కం బ్యాక్ అని చెప్పవచ్చు . చంటి, సుందరకాండ తర్వాత మళ్లీ వెంకటేశ్ బిగ్గెస్ట్ హిట్ అయిన సినిమా ధర్మచక్రం.
పవన్ కళ్యాణ్ :
2001లో ఖుషి మూవీ వరకు తిరుగులేని క్రేజ్ ను చవిచూసిన స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ మూవీ తర్వాత అన్ని ఫ్లాపులే వచ్చాయి. జానీ, గుడుంబా శంకర్,అన్నవరం, తీన్ మార్, పంజా ఇలా ఏది చూసినా అన్ని ఫ్లాపులే ఉన్నాయి. ఇక హిట్ రాదనే తీవ్ర నిరాశలో ఉన్న సమయంలో గబ్బర్ సింగ్ సినిమా బాక్సాఫీస్ వద్ద షేక్ చేసి పవన్ కళ్యాణ్ కు భారీ కంబ్యాక్ ఇచ్చింది.
మహేష్ బాబు :
పోకిరి లాంటి అల్టిమేట్ సినిమా తర్వాత సూపర్ స్టార్ గా మారిన మహేష్ బాబు సైనికుడు, అతిథి మూవీలు నిరాశే మిగిల్చాయి. దీని తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఖలేజా చేస్తే అది కూడా ఫ్లాప్ అయింది. ఈ తరుణంలోనే వచ్చిన సినిమా దూకుడు. వందకోట్ల గ్రాస్ ని దాటుకొని మహేష్ కు భారీ కం బ్యాక్ ఇచ్చింది.
ఎన్టీఆర్:
చిన్న వయసులోనే ఎవరికీ సాధ్యం కానీ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్ కెరీర్లో ఫ్లాప్ లు వచ్చినా ఇమేజ్ మాత్రం తగ్గలేదు. శక్తి, రామయ్య వస్తావయ్యా,రభస లాంటి మూవీస్ ఎన్టీఆర్ ఇమేజ్ ని కాస్త తగ్గించాయి. ఈ తరుణంలోనే టెంపర్ సినిమాతో మళ్లీ కొత్త లుక్ లో కనిపించాడు ఎన్టీఆర్. ఈ మూవీ అంతగా హిట్ కాకపోయినా, ఆయన్ను కొత్త లుక్ లో చూపించి భారీ కంబ్యాక్ ఇచ్చింది.
ప్రభాస్:
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చత్రపతి మూవీ తో పవర్ ఫుల్ మాస్ ఇమేజ్ సంపాదించుకున్నారు. దీని తర్వాత రిలీజ్ అయిన మూవీస్ అన్ని పెద్దగా హిట్ కాలేదు. డార్లింగ్,మిస్టర్ పర్ఫెక్ట్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చినా అవి క్లాస్ మూవీస్. దీని తర్వాత రిలీజైన మాస్ మూవీ మిర్చి.బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపీ ఈ భారీ కంబ్యాక్ ఇచ్చింది.
అల్లు అర్జున్ :
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ ఒక క్రమపద్ధతిలో వెళ్తూ ఉంటుంది. కెరీర్ మొదటి నుంచి ఆయనకు ఫ్లాఫ్స్ వచ్చినా మళ్లీ ఒక్క హిట్ తో మొత్తం స్టార్ డమ్ ని పెంచుకుంటూ పోతాడు. సరైనోడు హిట్ తర్వాత కాస్త బ్యాడ్ టైం నడిచింది. ఈ తరుణంలోనే వచ్చిన అల వైకుంఠ పురంలో సినిమా భారీ కం బ్యాక్ ఇచ్చింది.
రవితేజ :
2017 రాజా ది గ్రేట్ హిట్ తర్వాత రవితేజకు వరుస ఫ్లాప్స్ వచ్చాయి. రవితేజ పని అయిపోయింది అన్న సమయంలో అప్పుడు వచ్చింది క్రాక్. రవితేజ కెరీర్ లో మళ్లీ కం బ్యాక్ ఇచ్చింది.
Also Read: చిరంజీవి వాళ్ళ నాన్న గారు నటించిన సినిమాలు.!