Advertisement
బుల్లితెర ప్రేక్షకులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ( bigg boss 7 ) గ్రాండ్ గా ఈ ఆదివారం నుంచి ప్రారంభమయ్యింది. ఈసారి నాగార్జున ఎంట్రీ చాలా స్టైలీష్ గా, అట్రాక్టివ్ గా అందరిని ఆకట్టుకుంది. మొదటి పోటీదారిగా టీవీ నటి ప్రియాంక బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈసారి షోలో మరింత కొత్తగా, ఇంట్రెస్టింగ్ టాస్క్ లు, నిబంధనలతో ఉన్నాయి. దీనితో కంటెస్టెంట్స్ కు ఈసారి ఇవ్వబోయే టాస్క్ లు అంత ఈజీ కాదని తెలుస్తుంది.
Advertisement
ఇక కంటెస్టెంట్స్ ఓటింగ్ విషయంలో కూడా మార్పు చేసినట్లు ఎపిసోడ్ చివరలో నాగార్జున వెల్లడించి అందరికీ షాక్ ఇచ్చారు. బిగ్ బాస్ షోకి వెళ్లేందుకు చాలామంది ఇష్టపడతారు. ఎందుకంటే.. ఇది అత్యంత ఆదరణ కలిగిన షో కావడంతో భారీ ఫేమ్ సొంతం చేసుకోవచ్చు, అలాగే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రూ. 50 లక్షల నగదుతో పాటు విలువైన బహుమతులను సొంతం చేసుకుంటారు. అందుకే బిగ్ బాస్ షోకి వెళ్ళటానికి అంత ఆసక్తి చూపుతారు. అదే సమయంలో బిగ్ బాస్ హౌస్లో ఉండటం అంత సులభమైన విషయం కాదు. బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనే పోటీదారులకు కచ్చితంగా మానసికంగా, శారీరంగా దృఢంగా ఉన్నవారే ఈ షోలో ముందుకు కొనసాగుతారు. అయితే ఈ నేపథ్యంలో కొన్ని కొన్ని కారణాల వల్ల కొందరు సెలబ్రిటీస్ ఈ షో నుంచి తప్పుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
Advertisement
మొగలిరేకులు ఫేమ్ సాగర్, జబర్దస్త్ కమెడియన్ నటుడు మహేష్ ఆచంటలకు ఆఫర్ వచ్చినా రిజెక్ట్ చేశారట. ఇక సామ్రాట్, యూట్యూబర్ అనిల్ గీలాలకు చివరి నిమిషంలో ఛాన్స్ చేజారినట్లు తెలుస్తోంది. సీరియల్ నటి పూజా మూర్తి తండ్రి హఠాన్మరణంతో చివరి క్షణంలో షో నుంచి తప్పుకోవాల్సి వచ్చిందట. ఇక అంజలి పవన్ రెమ్యూనరేషన్ కారణంగా చివర్లో షో నుండి తప్పుకుందట. అలాగే జబర్దస్త్ నరేష్ సైతం జబర్దస్త్ షో అగ్రిమెంట్ బ్రేక్ చేసి బిగ్ బాస్ షోకి వెళ్లేందుకు అతడు కూడా ఆసక్తి చూపలేదట.
ఇది కూడా చదవండి:
అర్జున్ రెడ్డి హీరోయిన్ ఆసక్తికర పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్..!
చూసుకోవాలి కదా థమన్ భయ్యా..! మరీ ఇంత ఘోరంగా OG లోకి బిజీమ్ కాపీ చేస్తావా..?
బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి మొదటి రోజే షాక్ ఇచ్చిన నాగ్ ! మైండ్ బ్లోయింగ్ సర్..!