Advertisement
Bhuma Mounika First Marriage and Husaband Name: గత కొంతకాలంగా మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ మరియు భూమ మౌనికల గురించి ఎన్నో వార్తలు వైరల్ గా మారాయి. వీరి మధ్య ఏదో నడుస్తుందని అనేక వార్తలు వచ్చాయి. ఈ తరుణంలోనే వీరిద్దరూ వివాహం చేసుకొని ఈ వార్తలన్నిటికీ చెక్ పెట్టారు. లక్ష్మీ ప్రసన్న ఇంటిదగ్గర బంధుమిత్రుల ఆధ్వర్యంలో వివాహం ద్వారా ఒక్కటయ్యారు.
also read:నాటు నాటు పాటకు కాలు కదిపిన మాజీ క్రికెట్ లెజెండ్స్..!!

Bhuma Mounika First Marriage and Husaband Name:
2019 సంవత్సరంలో తన మొదటి భార్య ప్రణతి రెడ్డితో విడాకులు తీసుకున్న మనోజ్ ఆ తర్వాత భూమా మౌనిక రెడ్డి తో ప్రేమాయానం నడిపి గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్ లో ఉండడం సోషల్ మీడియాలో తరచూ వార్తలు వచ్చాయి. అంతేకాకుండా వీరిద్దరు పెళ్లి చేసుకునే సమయంలో మోహన్ బాబుకి ఈ పెళ్లి ఇష్టం లేదని వార్తలు కూడా అనేకం వచ్చాయి. కానీ మోహన్ బాబు ఆ పెళ్ళికి హాజరై వారిని ఆశీర్వదించడం చూసి అందరూ షాక్ అయ్యారు .
Advertisement
Bhuma Naga Mounika first Husband
ఇదంతా పక్కన పెడితే మంచు మనోజ్ కే కాకుండా మౌనిక రెడ్డి కి కూడా ఇది రెండవ పెళ్లి. గతంలో ఆమె బెంగళూరుకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త గణేష్ రెడ్డిని వివాహం చేసుకుంది. వీరిద్దరికి ఒక కొడుకు కూడా పుట్టారు. అయితే రెండు సంవత్సరాల క్రితం వీళ్ళ మధ్య ఏర్పడిన విభేదాల వల్ల విడిపోవలసి వచ్చింది. ప్రస్తుతం కొడుకు మౌనిక రెడ్డి తోనే ఉంటున్నాడు. రాజకీయాల్లో తన అక్క అఖిలప్రియ కోసం విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేయడం దగ్గర నుంచి వీళ్ళ మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. అది కాస్త గాలివానలా మారి విడిపోవలసి వచ్చింది.
Advertisement
ఇవి కూడా చదవండి: Telugu News, Tollywood Telugu Cinema Movie News