• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » Credit Card Meaning in Telugu: క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి? క్రెడిట్ కార్డు వలన ఉపయోగాలు ఏంటో తెలుసా..?

Credit Card Meaning in Telugu: క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి? క్రెడిట్ కార్డు వలన ఉపయోగాలు ఏంటో తెలుసా..?

Published on March 16, 2023 by karthik

Advertisement

Credit Card Meaning in Telugu: ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగింది. ఈ కార్డులను ఉపయోగించే వారి సంఖ్య నానాటికి పెరుగుతూనే వస్తుంది. క్రెడిట్ కార్డ్ నీ మనలో చాలామంది వాడతారు. ఈ కార్డులు ఒక 16 అంకెల సంఖ్యను కలిగి ఉంటాయి. ఈ కార్డుల ద్వారా ఒక ఏటీఎం నుండి డబ్బులు డ్రా చేయడానికి మరియు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో నగదు రహిత ట్రాన్సాక్షన్లు చేయడానికి ఉపయోగించవచ్చు. అయితే క్రెడిట్ కార్డు అంటే చాలా మంది భయపడిపోతుంటారు. క్రెడిట్ కార్డు తీసుకుంటే జీవితం నరకంగా మారుతుందని అపోహపడతారు. అయితే క్రెడిట్ కార్డును సరిగ్గా వినియోగిస్తే ఆర్థికంగా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. అసలు క్రెడిట్ కార్డు అంటే ఏమిటి? ఆ క్రెడిట్ కార్డు వలన ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

Read also: APOLLO FISH IN TELUGU: అపోలో ఫిష్ తినడం వల్ల కలిగే ఉపయోగాలు, అనర్ధాలు !

Credit Card Meaning Telugu, క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి:

* క్రెడిట్ కార్డు అనేది ఒక ప్రీ – సెట్ క్రెడిట్ పరిమితి తో బ్యాంకుల ద్వారా జారీ చేయబడిన ఒక ఆర్థిక సాధనం. ఈ కార్డు మీకు నగదు రహిత లావాదేవీలు చేయడానికి సహాయపడుతుంది.

* క్రెడిట్ కార్డ్ అనేది బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నుండి మీరు డబ్బు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ క్రెడిట్ కార్డు బ్యాంకులో క్రెడిట్ పరిమితిని కూడా పెంచుతుంది. అయితే ఈ పరిమితి మీ ఆదాయం ఆధారంగా ఉంటుంది.

* బ్యాంక్ మీ క్రెడిట్ కార్డు ఖర్చులను బిల్లు చేస్తుంది. దీనిని మీరు గడువు తేదీలోగా చెల్లించాలి. ఒకవేళ చెల్లించకపోతే తీసుకున్న డబ్బుపై వడ్డీ రేటును వసూలు చేస్తుంది.

Advertisement

Credit Card uses Teluguక్రెడిట్ కార్డు వలన లాభాలు:

  1. ఈ క్రెడిట్ కార్డుల ద్వారా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు లేకపోయినా కూడా క్రెడిట్ కార్డు ఉంటే వెంటనే దేనినైనా కొనుగోలు చేయవచ్చు. ఆన్లైన్ లో షాపింగ్ చేసి బిల్లులు చెల్లించవచ్చు.
  2. ప్రతి లావాదేవిలపై రివార్డు పాయింట్లను పొందవచ్చు. వీటిని రీడిమ్ చేసుకొని ఓచర్లను పొందవచ్చు.
  3.  ఏటీఎం క్యాష్ విత్ డ్రా సదుపాయం కూడా ఉంది. ఏ బ్యాంకు ఎటిఎంకు అయిన వెళ్లి డబ్బులు తీసుకోవచ్చు.
  4.  40 నుంచి 50 రోజుల వరకు వడ్డీ రహిత క్రెడిట్ సౌకర్యం ఉంటుంది. ఎప్పుడూ అవసరం అయినా కార్డు ను ఉపయోగించవచ్చు. టైం లిమిట్ అంటూ ఉండదు. విదేశాలలో కూడా క్రెడిట్ కార్డు ని ఉపయోగించవచ్చు.
  5.  ఎటువంటి ఎలక్ట్రానిక్ ప్రోడక్టులను అయినా క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసినప్పుడు వాటిని ఈఎమ్ఐ రూపంలోకి మార్చుకోవచ్చు.
  6.  కొన్ని క్రెడిట్ కార్డుల పై కాంప్లిమెంటరీగా నెలకు రెండు సినిమా టికెట్లు ఉచితంగా లభిస్తాయి. లేదా ఇతర ఆఫర్స్ అనేవి ఉంటాయి.
  7.  క్రెడిట్ కార్డు బిల్లులను క్రమం తప్పకుండా చెల్లిస్తూ వస్తే క్రెడిట్ స్కోర్ ను మెరుగుపరుచుకోవచ్చు.

Read also: ఇంటిముందు కాకి అరిస్తే అది మరణ సూచకమా?

C

Credit Card Telugu: క్రెడిట్ కార్డు ఎలా తీసుకోవాలి:

ఈ క్రెడిట్ కార్డు ని ఎలా తీసుకోవాలనేది చాలామందికి తెలియకపోవచ్చు. ఈ క్రెడిట్ కార్డు ని ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

* మీ కుటుంబ సభ్యులలో ఎవరికైనా ఒకరికి క్రెడిట్ కార్డు ఉంటే.. సప్లమెంటరీ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో ఇతరులు కూడా క్రెడిట్ కార్డు పొందొచ్చు.

* బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ కలిగి ఉన్నా కూడా సులభంగానే క్రెడిట్ కార్డు పొందొచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ (FD) మొత్తంలో 85% వరకు క్రెడిట్ లిమిట్ లభిస్తుంది. అయితే అన్ని బ్యాంకులు ఈ సేవలు అందించకపోవచ్చు.

* ఎమ్మెన్సీ కంపెనీలో పని చేస్తే ఈజీ గానే క్రెడిట్ లభిస్తుంది. మిగతా ఉద్యోగులు కూడా క్రెడిట్ కార్డు పొందవచ్చు. అయితే ఎమ్మెన్సీ ఉద్యోగులకు పొందినంత సులువుగా అయితే పొందలేరు. కొన్ని బ్యాంకులు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే విద్యార్థులకు కూడా క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి.

* క్రెడిట్ కార్డు పొందడానికి ఒక్కో బ్యాంకు కి ఒక్కో రూల్ అనేది ఉండడం జరుగుతుంది. కానీ అన్ని బ్యాంక్స్ ఒకే పద్ధతిలో ఇవ్వడం అనేది జరగదు. వేరు వేరు విధాలుగా ఉంటాయి.

Advertisement

Read also: స్టార్ హీరో శోభన్ బాబు తన కొడుకుని హీరోని ఎందుకు చేయలేదో తెలుసా..?

Latest Posts

  • ఎన్నారై అరెస్ట్ మిస్టరీ.. చంద్రబాబు సీరియస్
  • జగన్ ను సెల్ఫీలతో కవ్విస్తున్న లోకేష్
  • కేటీఆర్, బండి ట్వీట్ వార్.. తగ్గేదే లే!
  • పండుగపూట ఘోర విషాదం.. ఆ నిర్లక్ష్యమే కారణమా?
  • రైతులకు సాయంలో కూడా కులమేనా?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd