Advertisement
ప్రస్తుతం డొక్కా సీతమ్మ పేరు మారు మ్రోగిపోతోంది. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టారు. డొక్కా సీతమ్మ గురించి బలమైన చర్చ ప్రారంభమైంది. కానీ ఆమె గురించి మీకు తెలుసా..? ఆమె ఎవరో ఆమె గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా డొక్కా సీతమ్మ గురించి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆమె పేరిట క్యాంటీన్లు తెరుస్తామని ప్రకటించారు. అయినా సరే డొక్కా సీతమ్మ గురించి ఎక్కువ మందికి తెలియదు.
Advertisement
తాజాగా ప్రభుత్వం ఆమె పేరును గౌరవిస్తూ పథకానికి పెట్టిన వేళ ఆమె గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈమె 1841 లో పుట్టారు. చిన్నతనంలోనే తల్లి నరసమ్మ చనిపోయారు ఇంటి పనులు చక్కదిద్దడం అతిథులకు చుట్టాలకు ఆదిత్యమివ్వడం ఆప్యాయలతో గౌరవించడం ప్రాథమిక స్థాయి నుండి అలవర్చుకున్నారు. ఆమె తండ్రి భవాని శంకరాన్ని అంతా బువ్వన్నగా పిలుచుకుంటారు. సీతమ్మకు యుక్త వయసు రాగానే లంకల గన్నవరం గ్రామానికి చెందిన వేద పండితులు డొక్కా జోగన్నతో పెళ్లయింది.
Advertisement
Also read:
ఆకలి అన్న వాళ్లకు అన్నం పెట్టే అవకాశం ఇస్తేనే తను పెళ్లి చేసుకుంటానని సీతమ్మ అప్పట్లో కండిషన్ పెట్టారు. అందుకు అంగీకరించి సీతమ్మని పెళ్లి చేసుకున్నారు. సుమారు నాలుగు దశాబ్దాల పాటు సీతమ్మ తన సేవా ప్రస్థానాన్ని కొనసాగించారు పేదల ఇళ్లల్లో పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలకు కూడా సహాయం అందించేవారు. రోజు వందలాది మంది బాటసారులు, పేదలకు ఆమె ఉచితంగా భోజనాలు పెట్టారు. గోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ పేరు సుపరిచితం. ఆమె ఎంతగానో ప్రాచుర్యం పొందారు. గోదావరి ప్రజలు ఆమెను కీర్తించేవారు. 60 ఏళ్ల క్రితమే నిడదవోలులో స్వాతంత్ర సమరయోధుడు చింతలపాటి డొక్కా సీతమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!