Advertisement
త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా వస్తున్న ‘గుంటూరు కారం’ సినిమా నుంచి “కుర్చీ మడతపెట్టి” సాంగ్ రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే. మాస్ మసాలా సాంగ్ గా రూపు దిద్దుకున్న ఈ పాట కుర్రకారుని ఉర్రుతలూగిస్తోంది. ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ అయినప్పుడే అందరి మైండ్స్ బ్లాక్ అయ్యాయి. దానికి కారణం ఏంటంటే.. ఈ పాటలో అప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కుర్చీ తాత డైలాగ్ కూడా ఉండడమే. అసలు ఈ కుర్చీ తాత ఎవరు? ఆ తాత డైలాగ్ ని మహేష్ సినిమాలో ఎందుకు వాడారు? అనే సందేహాలు చాలా మందికే ఉన్నాయి. వాటన్నిటికీ క్లారిటీ రావాలంటే ఈ ఆర్టికల్ చదివేయండి.
Advertisement
హైదరాబాద్ కృష్ణకాంత్ పార్క్ వద్ద షేక్ మహ్మద్ పాషా ఖాళీగానే ఉంటారు. ఆయన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో తనపైకి కత్తి పట్టుకుని వచ్చిన నా బావమరిదిని కుర్చీ మడత పెట్టి *****తే మెడలు విరిగిపోయాయి అంటూ ఓ డైలాగ్ చెప్తాడు. ఈ డైలాగ్ చాలా పాపులర్ అయ్యింది. ఈ డైలాగ్ నెటిజన్స్ కు విపరీతంగా నచ్చేయడంతో ఉన్నట్లుండి కుర్చీ తాతగా పాపులర్ అయ్యాడు. కుర్చీ తాత చెప్పిన రఫ్ డైలాగ్ మాస్ ఆడియన్స్ కు విపరీతంగా నచ్చేసింది.
Advertisement
అంతే కాదు కుర్చీ తాత యాటిట్యూడ్ కూడా అలానే ఉంటుంది. ఎవడైతే నాకేంటి తరహాలో ఓ పూర్తి మాస్ సినిమా హీరో తరహాలో ఉంటాడు. పలువురు పొలిటీషియన్స్, హీరోలను కూడా కుర్చీ తాత తన వీడియోలలో తిట్టాడు కూడా. ఈ వీడియోలతోనే పాపులర్ అయ్యాడు. అలా పాపులర్ అయిన కుర్చీ తాత డైలాగ్ ని మహేష్ బాబు సినిమాలో ఓ సాంగ్ లో కూడా పెట్టారు. ఈ విషయమే పెద్దగా చర్చనీయాంశం అయ్యింది. మొన్నా మధ్య కుర్చీ తాత కనిపించడం లేదు అంటూ ఆమె భార్య పలువురు మీడియా ఛానెల్స్ ను కలిసింది. తీరా వెదికించగా.. వరంగల్లో ఉన్నట్లు తెలిసింది.
Read More:
పోకిరి సినిమా “గిల్లితే గిల్లిచ్చుకోవాలి..” డైలాగ్ పాప ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
Salar: సలార్ సినిమా అక్కడ ఎందుకు సక్సెస్ అవ్వలేదు? అసలు కారణం ఇదే!