Advertisement
Manchu Manoj Wife Name: మంచు మోహన్ బాబు తనయుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగు పెట్టిన మంచు మనోజ్ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. 2004లో ‘దొంగ దొంగది’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు మంచు మనోజ్. ఆ తర్వాత వరుసగా పలు సినిమాలు నటించాడు. అయితే మనోజ్ కొన్ని రోజుల నుంచి వ్యక్తిగతంగా బాగా హాట్ టాపిక్ గా మారుతున్నాడు. ఈయన 2017 మే లో ప్రణతి రెడ్డిని వివాహం చేసుకొని కొన్ని మనస్పర్ధల వల్ల ఆమెకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే.
Advertisement
Read also: చిరంజీవి రిజెక్ట్ చేసిన స్టోరీతో బ్లాక్ బస్టర్ అందుకున్న రజినీకాంత్ ఏ సినిమాతో అంటే ??
అలా కొంతకాలం ఒంటరిగా ఉన్న మనోజ్.. రెండవ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కొద్ది రోజులుగా వార్తలు వెలువడ్డాయి.ప్రముఖ దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి రెండవ కుమార్తె భూమా మౌనికతో మనోజ్ వివాహం జరగనున్నట్లు కథనాలు వచ్చాయి. అయితే ఈ పుకార్లకు మంచు మనోజ్ – భూమా మౌనిక గతేడాది సెప్టెంబర్ తొలివారంలో హైదరాబాద్ సీతాఫల్మండి లోని వినాయక మండపంలో జంటగా కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. కట్ చేస్తే వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు.
Advertisement
మంచు మనోజ్ – భూమా మౌనిక రెడ్డి వివాహం మార్చి 3వ తేదీన రాత్రి 8:30 గంటలకు కుటుంబ సభ్యులతో పాటు అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది. హైదరాబాద్ ఫిలింనగర్ లోని మనోజ్ సోదరి నటి మంచు లక్ష్మి ఇంట్లో ఈ వేడుక జరిగింది. దీంతో ఇప్పుడు మనోజ్ పెళ్లి చేసుకున్న భూమా మౌనిక రెడ్డి ఎవరు? ఆమె ఆస్తుల గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భూమా మౌనిక దివంగత నేత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల రెండవ కూతురు.
Read also: చిరంజీవి మీద కోపం వచ్చి మగధీరలో చరణ్ తో ఆ సీన్ తీశాను..!
ఈమెకి గతంలో బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గణేష్ రెడ్డితో 2016 లో వివాహం జరిగింది. వీరికి ధైరవ్ రెడ్డి అనే ఐదు సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు. అయితే వారి మధ్య ఉన్న మనస్పర్ధల కారణంగా మౌనిక అతనితో విడాకులు తీసుకుంది. మౌనిక ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు. భూమ మౌనికకి తన సోదరీ అఖిలప్రియ తో ఆస్తి వివాదాలు ఉన్నట్లు ఓ రూమర్ కూడా ఉంది. భూమా మౌనిక ఆస్తుల విలువ సుమారు 200 కోట్లు ఉంటుందని అంచనా. అంతేకాదు వీటితోపాటు మరికొన్ని విలువైన ప్రాపర్టీస్ కూడా భూమా మౌనిక పేరు మీద ఉన్నాయట.
Read also: SR.NTR: ఎన్టీఆర్ కి ఇష్టమైన వంటకం ఏదో తెలుసా..?