Advertisement
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో కాంగ్రెస్ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ వేడుక చాలా ఘనంగా జరిగింది. అయితే.. ఈ వేడుకకు హాజరు అయిన వారిలో ఓ అమ్మాయి హైలైట్ అయ్యింది. ఆమె ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు వెనుకగా కూర్చోవడంతో పదే పదే కెమెరాలను వారిపై ఫోకస్ చేయడంతో.. ఆమె కూడా ఫోకస్ అయ్యారు. దానికి తోడు ఆమె చాలా అందంగా కూడా ఉండడంతో.. సహజంగానే నెటిజన్స్ లో క్యూరియాసిటీ పెరిగింది. ఈ అమ్మాయి ఎవరు? అంటూ ఆరాలు మొదలు పెట్టేసారు.
Advertisement
ఈమెని ఎప్పుడు ఎవరూ టివి స్క్రీన్స్ లో కానీ, ఏ న్యూస్ ఛానెల్ వీడియోస్ లో కానీ చూడలేదు. అందుకే ఆమె ఎవరో ఎవరికీ తెలియదు. ఆమె పేరు ప్రణితి షిండే. మహారాష్ట్ర, సోలాపూర్ కు ఆమె సెంట్రల్ ఎమ్మెల్యే. అంతే కాకుండా ఆమె మహారాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా. ఆమె వయసు 43 సంవత్సరాలు. తండ్రి సుశీల్ కుమార్ షిండే కూడా రాజకీయ నాయకుడే. ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పని చేసారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఆయన గవర్నర్ గా కూడా పని చేసారు.
Advertisement
ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు ఉండగా.. వారిలో చిన్న కూతురే ప్రణితి. ఆయన రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆమె రాజకీయ పగ్గాలు తీసుకున్నారు. 28 సంవత్సరాల వయసులోనే ఆమె తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. జై జుయ్ అనే ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆమె ఎప్పుడు ప్రజలతోనే ఉంటారు. ఆమె రాజకీయాల్లో చాలా యాక్టివ్ గా ఉంటారు. మహారాష్ట్ర పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలోనే ఆమె కూడా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరు అయ్యారు.
Read More:
రజినీకి ఏ ఉద్యోగం ఇచ్చారు.. జీతం ఎంత ఇస్తున్నారో తెలుసా?
ఇన్నేళ్ళుగా లేనిది ఇప్పుడే కెసిఆర్ కి ఎందుకు ఇలా అయ్యింది ? ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో జరిగింది ఇదే !