Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ అంటే తెలియని వారు ఉండరు. ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగారు. 6 పదుల వయస్సు దాటిన ఇప్పటికీ యంగ్ హీరోలతో సమానంగా నటిస్తూ దూసుకుపోతున్నారు. అలాంటి బాలయ్య కెరియర్ ఇక ముగుస్తుంది అనుకునే సమయానికి బోయపాటి శీను మళ్లీ కం బ్యాక్ ఇచ్చారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘అఖండ’ మూవీ సూపర్ హిట్ అందుకుంది. దీంతో ఆయన మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకుండా ముందుకు వెళ్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం ఎంతో కలిసొచ్చిందని చెప్పవచ్చు.
Advertisement
అయితే హిట్ అయిన ఈ మూవీలో బాలకృష్ణ తల్లిగా నటించిన ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం. అఖండ చిత్రంలో బాలకృష్ణ తల్లి పాత్రలో చేసింది వీజీ చంద్రశేఖర్. ఈమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఈమె భర్త ఎయిర్ ఇండియాలో సీనియర్ రిటైర్డ్ కెప్టెన్. అయితే ఆయన రిటైర్డ్ అయినప్పటికీ కూడా ఇంకా అందులోనే పనిచేస్తున్నారు. అయితే చంద్రశేఖర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలు చెప్పింది. ఈమె ఎక్కువ సమయాన్ని కుటుంబంతోనే గడుపుతుండట.
Advertisement
అందుకోసమే కేవలం నెలలో 12 రోజులు మాత్రమే పని చేస్తానని చెప్పింది. ఈమెకు ఇద్దరు ఆడపిల్లలు. వీరిలో ఒకరు డాక్టర్ కాగా మరొకరు యాక్టర్. అయితే ఈమె భర్త కెప్టెన్ అవ్వడం వల్ల ఎక్కువగా ఇంటికి వచ్చేవారు కాదట , అప్పుడప్పుడు వస్తూ పోతుండేవాడు. దీంతో పిల్లల బాధ్యత పూర్తిగా ఈమె పైన పడిందట. చిన్నప్పటి నుంచి పిల్లల్ని సక్రమంగా నడిపిస్తూ వచ్చారట. అలాగే పిల్లలకు సంబంధించిన ఫంక్షన్స్ ని కూడా ఈమె నిర్వహించే వారని చెప్పింది. మొత్తానికి సినిమాల కంటే ఎక్కువ కుటుంబానికే ప్రాధాన్యత ఇచ్చేదాన్ని అని వీజీ చంద్రశేఖర్ అన్నారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు:
- ఎలాంటి పరిస్థితుల్లో మీ భాగస్వామితో 6 విషయాల అస్సలు చెప్పకండి.2వది చాలా ఇంపార్టెంట్..!!
- రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసిన హీరోల సినిమాలు ఏవో తెలుసా…!
- Sr. NTR, Jr. NTR పెళ్లి పత్రికల్లో ఇవి గమనించారా…!