Advertisement
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు నాయుడుని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనితో ఈ కేసుకు సంబంధించిన వివరాల గురించి ప్రజలలో ఆసక్తి నెలకొంది. చంద్రబాబు నాయుడుకు ఎందుకు బెయిల్ రాలేదు? ఆయన కేసును వాదిస్తున్న లాయర్ ఎవరు? అన్న విషయాల గురించి ఈ ఆర్టికల్ లో చూద్దాం. చంద్రబాబు నాయుడు కేసును అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రా వాదిస్తున్నారు. లాయర్ గా ఆయనకు చాలా సంవత్సరాల ఎక్స్పీఎరియన్స్ ఉంది.
Advertisement
ఎన్నికలకు సంబంధించి, ప్రాధమిక హక్కులకు సంబంధించి, పాలనా విధానాల విషయంలోనూ, క్రిమినల్ చట్టాల్లో కూడా ఆయన పలు విషయాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరపున తన వాదనలను వినిపించారు. సైబర్ మోసాలు, వైట్ కాలర్ నేరాలు, క్రిమినల్ చట్టాలకు సంబంధించిన కేసులను వాదించడంలో చాలా నైపుణ్యం కలిగిన లూథ్రా చంద్రబాబు నాయుడి కేసును టేక్ అప్ చేసారు. ఆయన తన న్యాయశాస్త్ర పట్టాను ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అందుకున్నారు. సిద్ధార్థ్ లూథ్రా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి క్రిమినాలజీలో ఎంఫిల్ పట్టాను కూడా అందుకున్నారు.
Advertisement
ఆయన ప్రస్తుతం ఇండియన్ క్రిమినల్ జస్టిస్ సొసైటీ ఉపాధ్యక్షునిగా, ఢిల్లీ రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ సభ్యునిగా పని చేస్తున్నారు. దేశ విదేశాల్లో న్యాయశాస్త్రాన్ని బోధించే ఉపాధ్యాయుడిగా కూడా ఆయనకు పేరు ఉంది. ఆయన బ్రిటన్‌లోని నార్తుంబ్రియా విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్ గా కూడా పని చేస్తున్నారు. భారత దేశం లోని టాప్ క్రిమినల్ లాయర్లు లో లూథ్రా ఒకరు. 2010 నుంచి ఆయన సుప్రీం కోర్టులో పని చేస్తున్నారు. భారత ప్రభుత్వం తరపున ఆయన ఢిల్లీ హైకోర్టులో 2004 నుంచి 2007 వరకు అనేక వాదనలు వినిపించారు. ఆయన కోర్టుకి హాజరు అవ్వాలంటే ఐదు లక్షల ఫీజుని వసూలు చేస్తారు. ప్రయాణ ఖర్చులు, అకామడేషన్ కు అదనంగా చెల్లించాలి. ఒక్కోసారి కేసు తీవ్రతని బట్టి కోర్టులో వాదించడానికి పదిహేను లక్షల రూపాయల వరకు కూడా డిమాండ్ చేస్తారు.
మరిన్ని..