Advertisement
చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చిరంజీవి ఎప్పుడో ఇండస్ట్రీ లోకి వచ్చారు చాలా హిట్ల ని అందుకున్నారు 150 కి పైగా సినిమాల్లో నటించారు చిరంజీవి. చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా చేస్తున్నారు. చిరు ఇంతకు ముందు చేసిన భోళా శంకర్ సినిమా అందరిని నిరాశపరిచింది. సో ఫ్యాన్స్ విశ్వంభర సినిమా అయినా హిట్ అయితే బాగుండు అని కోరుకుంటున్నారు. చిరంజీవి గత 40 ఏళ్ళ నుండి ఇండస్ట్రీ లో మెగాస్టార్ గా వెలుగొందుతున్నారు. అలానే తన కొడుకు ని కూడా హీరోగా మార్చారు.
Advertisement
రామ్ చరణ్ మెగాస్టార్ తనయుడు గా ఇండస్ట్రీ లోకి వచ్చారు. తర్వాత తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు రామ్ చరణ్. మెగాస్టార్ రేంజ్ హీరో కావాలని చిరంజీవి భావించారు. అందుకనే చిరంజీవి రామ్ చరణ్ చేత ఎంతో కష్టపడేలా చేశారట మొదట్లో కొన్ని సందర్భాల్లో చరణ్ ఫ్లాప్ సినిమాలు చేసిన తర్వాత వైవిధ్యమైన కథాంశాలని ఎంచుకుని వాటిని సినిమాలుగా చేయడానికి ఎక్కువ ఆసక్తిని చూపించమని చిరంజీవి చరణ్ కి చెప్పే వారట. దాని వలన ఆయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఇండియాలో ఉన్న చాలా మంది అభిమానులు చిరంజీవిని ఓ ప్రశ్న అడుగుతున్నారు.
Advertisement
ఎందుకంటే ప్రస్తుతం ఇండియాలోని ది బెస్ట్ ఆర్టిస్టులుగా పేరుపొందిన ఏ ఒక నటుడు కూడా కొడుకులని స్టార్ హీరో రేంజ్ కి తీసుకు వెళ్లలేకపోతున్నారు కేవలం చిరు మాత్రమే చరణ్ ని గ్లోబల్ స్టార్ గా మార్చారు. తండ్రికి తగ్గ తనయుడిగా కూడా మార్చారని చాలామంది అంటున్నారు బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ తన కొడుకు అభిషేక్ బచ్చన్ ని గ్రాండ్ గా ఇండస్ట్రీకి పరిచయం చేసినా కూడా అభిషేక్ బచ్చన్ మాత్రం సక్సెస్ ని అందుకోలేదు కొంతవరకు వెనుకబడ్డాడు అని చెప్పొచ్చు. నిజానికి అంత పెద్ద స్టార్ హీరో అవ్వాలంటే ఎంతో కష్టపడాలి పైగా అందరికీ ఎంత రేంజ్ లోకి రావడం కుదరదు ఎంతో కష్టంతో కూడుకున్న పని ఇది ఈ విషయంలో చిరు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!