Advertisement
ఆషాడమాసం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది కొత్తగా పెళ్లి అయిన జంటలు కలిసి ఉండరాదని. చాలామందికి ఆషాడమాసంలో కలిసి ఉండకూడదు అనే విషయం మాత్రమే తెలుసు.. కానీ ఎందుకు కలిసి ఉండరాదు, దాని వెనక ఉన్న రహస్యం ఏంటో తెలియదు..! కొత్తగా పెళ్లయి అత్తవారి ఇంట్లోకి అడుగు పెట్టిన కోడలు, ఆషాడ మాసం వస్తే కలిసి ఉండరాదని అత్తా కోడలు ఓకే గడప దాటరాదనేది మన తెలుగు వారి సాంప్రదాయం.
Advertisement
Also Read: హిట్ అయిన సినిమాల్లో మంచి పాత్రలను వదులుకున్న 10 మంది స్టార్లు వీళ్లే!
Advertisement
దీని వెనుక ఉన్న సైన్స్ ప్రకారం పరిశీలిస్తే చాలా ఆరోగ్య రహస్యాలు ఇమిడి ఉన్నాయి. ఆషాడమాసంలో దంపతులిద్దరూ కలిసి ఉండడం వల్ల గర్భం దాలిస్తే బిడ్డ పుట్టే వరకు చైత్ర, వైశాఖ మాసం వస్తుంది. ఎండాకాలం ప్రారంభం అవుతుంది. ఎండలకు బాలింతలు, పసిపాపలు తట్టుకోలేరని మన పూర్వకాలం పెద్దలు ఈ నియమాన్ని పెట్టారు. అలాగే ఆషాడమాసంలో కొత్త అల్లుడు కూడా అత్తవారింటికి వెళ్ళకూడదని నియమం కూడా ఉంది. ఈ నియమాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆషాడమాసం సమయంలో వ్యవసాయ పనులు ప్రారంభం అవుతాయి.
ఈ సమయంలో కొత్త అల్లుడు ఇంటికి వస్తే అత్తింటివారు అతిథి మర్యాద చేయాల్సి వస్తుంది. ఈ సందర్భంలో పొలం పనులకు అంతరాయం ఏర్పడుతుంది. అలాగే పెళ్లయిన కొత్తలో భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఒకరిపై ఒకరికి ప్రేమ ఆకర్షణ ఎక్కువగా ఉంటాయి. ఈ ఆషాడమాసంలో దూరంగా ఉండటం వల్ల ఎడబాటు బాధ ఇద్దరికీ అర్థమవుతుంది. దీని ద్వారా వారి మధ్య ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయత మరింత బలపడుతుందని అంటారు.
Also Read: ఆషాఢమాసంలో ఆడపిల్లలు గోరింటాకు తప్పకుండా పెట్టుకోవాలట ..!